YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రఘురామ సభహక్కుల ఉల్లంఘన నోటీసుపై కదిలిన లోక్సభ సెక్రటేరియట్

రఘురామ సభహక్కుల ఉల్లంఘన నోటీసుపై కదిలిన లోక్సభ సెక్రటేరియట్

న్యూఢిల్లీ
 ఏపీ సీఎం, డీజీపీ ఇతర పోలీసు అధికారులపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై లోక్సభ సెక్రటేరియట్ స్పందించారు. వెంటనే సమగ్ర వివరాలు అందజేయాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను కోరారు. జూన్ రెండో తేదీన రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన లేఖపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, కస్టోడియల్ టార్చర్కు గురిచేశారని లోక్సభ స్పీకర్కు ఎంపీ  ఫిర్యాదు చేశారు. తన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్పై ఎంపీ రఘురామ సభా హక్కుల ఉల్లంఘన పిర్యాదు చేశారు. రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్కు గురి చేయడంపై ఆయన కుమారుడు భరత్, టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు కనకమేడల రవీంద్ర కుమార్ల లేఖలోని అంశాలపైన వివరాలు ఇవ్వాలని హోంశాఖను లోక్సభ సెక్రటేరియట్ కోరారు. 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను హిందీ, ఇంగ్లీష్ కాపీలలో తమకు అందజేయాలని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశించారు.

Related Posts