న్యూఢిల్లీ, జూన్ 18,
ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ DA, డియర్‌నెస్ రిలీఫ్ DR పెంపు అమలు కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. ట్రావెల్ అలవెన్స్ TA క్లెయిమ్స్ సమర్పణకు టైమ్ లిమిట్‌ను పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్ సమర్పణకు టైమ్ లిమిట్‌ను 60 రోజుల నుంచి 180కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ సమయంలో టీఏ సమర్పణకు టైమ్ లిమిట్ మార్పు నిర్ణయం జూన్ 15 నుంచే అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.కేంద్ర ప్రభుత్వపు తాజా నిర్ణయంతో పదవీ విరమణ అవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలుగనుంది. టీఏ క్లెయిమ్స్ సమర్పణకు 60 రోజుల గడువు వల్ల చాలా మంది ఇబ్బందుల పడేవారు. ఇప్పుడు ఈ టైమ్ లిమిట్‌ను 180 రోజులకు పెంచడం వల్ల ఉద్యోగులకు ఊరట కలుగనుంది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏను జూలై నుంచి చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. డీఏ చెల్లింపు కారణంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట కలుగనుంది. కరోనా కష్ట కాలంలో జీతం పెరగనుంది.