YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

7 రాష్ట్రాల్లో సెంచరీ దాటేసిన పెట్రోల్

7 రాష్ట్రాల్లో సెంచరీ దాటేసిన పెట్రోల్

హైదరాబాద్, జూన్ 18, 
దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. గ‌త కొన్ని రోజులుగా వ‌రుస‌గా పెరుగుతూ వ‌చ్చిన పెట్రోల్ ధ‌ర‌లు గురువారం కాస్త త‌గ్గినా ఇవాళ మ‌ళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 26-27 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 28-30 పైసలు పెంచుతూ శుక్రవారం దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103కు చేరుకుంది.
ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.109కి చేరడం గమనార్హం. మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్కును దాటింది. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లఢ‌క్‌, కర్ణాటక ఉన్నాయి. కాగా, మే 29న ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 చేరుకుంది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టడం అదే మొదటిసారి.ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్‌ రూ.103.8గా, డీజిల్‌ ధర రూ.95.14గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.74గా, డీజిల్‌ రూ.95.59గా నడుస్తున్న‌ది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేట్లు వరుసగా రూ.96.93, రూ.87.69గా ఉన్నాయి. మే తొలి వారం నుంచి ప్రారంభమైన ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉన్న‌ది. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 రోజులపాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది.త‌ర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ ధర రూ.6, డీజిల్‌ ధర రూ.7 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా రెండో రోజూ పడిపోయాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో డాలర్‌ బలపడింది. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ బ్యారెల్‌ ధర 52 సెంట్లు పడిపోయి 72.56 డాలర్లుగా నడుస్తోంది. ఇక యూఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 48 సెంట్లు తగ్గి 70.56 డాలర్లుగా కొనసాగుతున్న‌ది.

Related Posts