YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు చెక్కులు పంపిణీకి ప్రత్యేక చర్యలు సీజనల్ కండీషన్స్, హరితహారం నర్సరీల ఏర్పాటు, ధాన్యం సేకరణ, జాతీయరహదారులకు భూసేకరణ, బిసి సంక్షేమం, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) తదితర అంశాలపై సిఎస్ వీడియోకాన్ఫరెన్స్

రైతు బంధు చెక్కులు పంపిణీకి ప్రత్యేక చర్యలు     సీజనల్ కండీషన్స్, హరితహారం నర్సరీల ఏర్పాటు,   ధాన్యం సేకరణ,   జాతీయరహదారులకు భూసేకరణ,    బిసి సంక్షేమం, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ)     తదితర అంశాలపై సిఎస్ వీడియోకాన్ఫరెన్స్

రాష్ట్ర వ్యాప్తంగా  మే నెల 10 నుండి రైతు బంధు పథకానికి సంబంధించి చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి, ఎన్నికల సమయంలో చేసే ఏర్పాట్లలా ప్రత్యేక స్లిప్పులు జారీచేసి సత్వర పంపిణీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మంగళవారం సచివాలయంలో రైతు బంధు చెక్కుల పంపిణి, పట్టదారు పాసు పుస్తకాల పంపిణీ,  సీజనల్ కండీషన్స్, హరితహారం నర్సరీల ఏర్పాటు, ధాన్యం సేకరణ,   జాతీయరహదారులకు భూసేకరణ,  కర్ణాటక ఎన్నికల సందర్భంగా సరిహద్దు జిల్లాలలో ఏర్పాట్లు, బిసి సంక్షేమం, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్  నిర్వహించారు. గ్రామాలలో రద్ది ఏర్పడకుండా రైతులకు ప్రత్యేక స్లిప్పులు జారీచేసి కౌంటర్ల ద్వారా పంపిణి చేయాలన్నారు. ఇప్పటికే 45 లక్షల  పట్టదారు పాసుపుస్తకాలు ప్రింట్ చేశారని 23 లక్షలు డిస్పాచ్ చేశామని, 15 లక్షలు జిల్లాలకు చేరుకున్నాయని వివరించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, వ్యవసాయ అధికారులతో ఇటీవల జరిగిన సమావేశంలో రైతు బంధు చెక్కులు, కొత్తపట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మార్గనిర్ధేశం  చేశారని, ఇది ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని, గౌరవ ప్రజాప్రతినిధులు అందరు పాల్గొనేలా చూడాలని అన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై సిసిఎల్ ఏ ద్వారా ఇప్పటికే సర్క్యూలర్ జారీ చేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి కలెక్టర్లకు తెలిపారు. మండలాల వారిగా, గ్రామాల వారిగా చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీని సమన్వయం చేసుకోవాలని రాజేశ్వర్ తివారి అన్నారు. ప్రతి రోజు పాసు పుస్తకాల పంపిణీ వివరాలు కేంద్ర కార్యాలయానికి సమర్పించాలన్నారు.పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఆధార్ సీడింగ్ కాని రైతులు  పాసుపుస్తకాల పంపిణీ సమయంలో సమర్పిస్తే అదేరోజు పంపిణి చేయాలన్నారు. ఆర్ఓఎఫ్ ఆర్ కు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ సమర్పించిన లిస్టు మేరకు పట్టా సర్టిఫికేట్, ఆధార్ ఆధారంగా  ఏజేన్సీ ఏరియా రైతులకు రైతు బంధు చెక్కులు పంపిణి చేయాలన్నారు. ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకున్న పట్టాదారు పాసుపుస్తకాలపై వెంటనే డిజిటల్ సంతకాలు పూర్తి చేయాలని సి.యస్ అన్నారు. గ్రామాల వారిగా అధికారుల టీమ్ లు షెడ్యూల్ ప్రకారం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు  చేపట్టాలన్నారు. రైతు బంధు చెక్కులకు సంబంధించి సమీక్షలో 5600 కోట్లు ఆర్ధిక సహాయన్ని ఖరీఫ్ కు అంచనా వేశామని ఇప్పటికే మొదటి విడత 1600 కోట్లు జమచేశామని 2,3 రోజులలో మరో 2400 కోట్లు, వారంలోగా మూడవ విడత నిధులను బ్యాంకులలో జమ చేస్తామని, ఎక్కడా నగదు కొరత రాకుండా బ్యాంకర్లతో సమీక్షించాలని సి.యస్ సూచించారు. 58 లక్షల చెక్కులను ప్రింట్  చేయాలని నిర్ణయించి 54.15 లక్షలు ముద్రించామని, జిల్లాలకు పంపామని,  పంపిణికి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.రైతులు చెక్కులు డ్రా చేసేటప్పుడు పట్టాదారు పాసుపుస్తకాన్ని ఐడి ఫ్రూప్ గా సమర్పించాలన్నారు. వ్యవసాయశాఖ  ముఖ్యకార్యదర్శి పార్ధసారధి మాట్లాడుతూ జిల్లాలలో ప్రత్యేక ఆఫీసర్ లను నియమించామని, పొర్టల్ ను అభివృద్ధి చేశామని గ్రామల వారిగా షెడ్యూల్ జారీ చేశామన్నారు. రాష్ట్ర స్ధాయి, జిల్లా స్ధాయి, డాష్ బోర్డ్స్ రూపొందించామని, వ్యవసాయ అధికారులు ట్యాబ్ లద్వారా సమాచారం ఎప్పటికప్పుడు పంపాలన్నారు. పంపిణీకాని చెక్కులపై 18 తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు.హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎండాకాలంలో రక్షించే చర్యలు తీసుకోవాలని, నీటి సౌకర్యం ఏర్పాటు చేయటంతో పాటు, జులైలో మొదలయ్యే నాలుగో విడత హరితహారం కోసం నర్సరీల్లో మంచి నాణ్యత కల్గిన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత  ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నిజిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని పట్టణ ప్రాంతాల్లో, గ్రామ పంచాయితీ స్థాయిలో నర్సరీలు ఏర్పాటు చేయాలని, కొత్తగా సుమారు తొమ్మిది వేల నర్సరీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందన్నారు. కొత్త నర్సరీలకు స్థలం గుర్తింపు, అవసరమైన మౌళిక సదుపాయాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే జిల్లాలకు పంపిన ఫార్మాట్ లను అన్ని వివరాలతో అటవీ శాఖ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు.  త్వరలోనే రాష్ట్ర , జిల్లా స్థాయిలో కొత్త నర్సరీల ఏర్పాటుపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ శాఖతో పాటు గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖల సిబ్బంది దీనిలో పాల్గొంటారని తెలిపారు. వచ్చే సీజన్ హరితహారం కోసం జిల్లాల వారీగా కార్యాచరణను సిద్దం చేయాలని ఆదేశించారు.ప్రధాన అటవీ సంరక్షణ అధికారి రఘువీర్ మాట్లాడుతూ, హరితహారంలో భాగంగా అడవి లోపల సహజ సిద్దంగా 100 కోట్ల మొక్కల పెంపకానికి, పునరుజ్జీవన చర్యలకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, దీనిద్వారా అడవుల సహజత్వాన్ని కాపాడుకోవచ్చని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా అటవీ రక్షణ కమిటీల ద్వారా కలెక్టర్లు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఇక అటవీ నేరాలకు పీ.డీ యాక్టుపై కేసులు పెట్టే వెసలుబాటును ప్రభుత్వం కల్పించినందున, అక్రమ చెట్ల నరికివేత, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణను సమర్థవంతంగా అధికారులు చేపట్టవచ్చన్నారు.ఇప్పటికే నాటిన మొక్కలను నీటి సౌకర్యం కొరత లేకుండా చూడటంతో పాటు, కొత్త నర్సరీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత కలెక్టర్లు ఇవ్వాలని, తమ జిల్లాల పర్యటనల్లో తప్పని సరిగా సమీప నర్సరీల తనిఖీని తప్పనిసరిగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ సూచించారు. నర్సరీల రక్షణకు షేడ్ నెట్ ను వాడాలని తెలిపారు.  అవసరం అయితే మొక్కల సంరక్షణకు, నీటి సౌకర్యం ఏర్పాటుకు అగ్ని మాపక దళం సేవలను వాడుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారని ప్రియాంక వర్గీస్  గుర్తుచేశారు.జాతీయ రహదారులకు సంబంధించి మాట్లాడుతూ గత 17 సంవత్సరాలలో తెలంగాణలో కేవలం 765 కి.మీ 4 లేన్ల జాతీయ రహదారులు ప్రతిపాదించారని, ప్రస్తుతం 25 వేల కోట్ల విలువగల 1000కి.మీ లను ప్రతిపాదిస్తున్నామని, వీటిని సకాలంలో పూర్తి చేయటానికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సి.యస్ అన్నారు. 2017-18 లో 4 ప్రాజేక్టులకు సంబంధించి 188 కి.మీ 4/6 లేన్లను 4439 కోట్లతో NHAI అభివృద్ధి చేస్తున్నదని, 2018-19 లో మరో 673 కి.మీ అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని అన్నారు. 179 కి.మీ లకు సంబంధించి టెండర్లను పిలిచిందని అన్నారు. రహదారులు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ జిల్లాల వారిగా భూసేకణపై  కలెక్టర్లతో సమీక్షించారు.ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్లు మంచినీరు, పశుగ్రాసం పై దృష్టి సారించాలన్నారు. సాధారణ హీట్ వేవ్ కొనసాగుతున్నదని, కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులు  వస్తున్నాయని, వీటికి సంబంధించి రెండు రోజుల ముందే వివరాలు పంపుతున్నామన్నారు. హీట్ వేవ్ ఆక్షన్ ప్లాన్ అమలుపై జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలన్నారు. రెవెన్యూ (డి.యం) ముఖ్యకార్యదర్శి ఆర్.వి చంద్రవదన్ మాట్లాడుచూ వడదెబ్బ  మరణాలకు  సంబంధించిన GoI, ఫ్రొపార్మా ప్రకారం మండల కమిటీ నివేధికతో ప్రభుత్వానికి పంపాలన్నారు.వరి ధాన్యం సేకరణకు సంబంధించి రబిలో 38 లక్షలు మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం కాగా ఇప్పటికే 7 లక్షలు సేకరించామని, సి.యస్ అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్భంది లేకుండా అవసరమైన ఐకేపి కేంద్రాలు తెరవాలని, మద్దతు ధర వచ్చేలా చూడాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వ్యవసాయ, సివిల్ సర్వీస్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆర బెట్టాక తెచ్చేలా చైతన్యం చేయాలన్నారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.బిసి సంక్షేమానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కోసం 5,77633 ధరఖాస్తులు వచ్చాయని, వీటిని నెలలోగా పరిశీలన పూర్తి చేయాలని, ప్రయారిటైజ్ చేయాలని బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. 2015-16 కు సంబంధించి 5,6 జిల్లాలలో గ్రౌండింగ్ పూర్తి కావల్సి ఉందని దీనిని 10 రోజులలోగా పూర్తి చేయాలన్నారు. 119 కొత్త బిసి రెసిడెన్షియల్ స్కూళ్ళకోసం స్ధలం, భవనాలఎంపికను చేపట్టాలన్నారు. ఎస్.సి, ఎస్.టి,బిసి,మైనారిటీ  స్కూళ్ళను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని సి.యస్ కలెక్టర్లను కోరారు.మే 12 న కర్ణాటక ఎన్నికల సందర్భంగా సరిహద్ధు జిల్లాల కలెక్టరు చెక్ పోస్టు ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జి.ఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా కలెక్టర్లను కోరారు.పోలింగ్ తేదికి 48 గంటలకు ముందుగా మే 10,  సాయంత్రం 5.00 గం.ల నుండి సరిహద్దులో గుర్తించిన లిక్కర్ షాపులను క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు జిల్లాల కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై గత నెల 27 న సర్క్యులర్ మెమో ను జారీచేశామన్నారు.స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణా కు సంబంధించి కేంద్ర కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తో కలిసి 19 జిల్లాలను ఓడిఎఫ్  గా ప్రకటించేందుకు అవసరమైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. అక్టోబర్ 2,2018 నాటికి రాష్ట్రం మొత్తం ఓడిఎఫ్ గా ప్రకటించేందుకు 7,61,577 టాయిలెట్లను నిర్మించాల్సి ఉందని, వీటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని , నెల వారిగా ప్రణాళికలు రూపొందించుకొని జిల్లాలను ఓడిఎఫ్ గా రూపుదిద్దాలని సియస్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 83 శాతం కవరేజ్ సాధించామని మిగిలిన 17 శాతాన్ని పూర్తి చేయాలన్నారు. కేంద్ర కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ తెలంగాణలో 1013 గ్రామాలలో 100 శాతం కవరేజి అయినప్పటికి చిన్న, చిన్న గ్యాప్స్ ఉన్నాయని వీటిని వెంటనే పూర్తి చేసి ఓడిఎఫ్ గా ప్రకటించాలన్నారు. మరో 1149 గ్రామాలలో 90 శాతం నుండి 99 శాతం కవరేజి అయ్యాయని వీటి పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. విలేజ్ స్వచ్ఛత ఇన్ డెక్స్ ను గ్రామాల వారిగా రూపోందించాలన్నారు. తెలంగాణలో 11 జిల్లాలు ఓడిఎఫ్ సాధించాయని మిగిలిన 19 జిల్లాలలో 8 జిల్లాలలో 75 శాతం కంటె ఎక్కవ, 5 జిల్లాలో 90 శాతం కంటె ఎక్కువ కవరేజి అయ్యాయని వీటిలో టాయిలేట్లను వేగంగా పూర్తి చేయటానికి కలెక్టర్లు కృషి చేయాలన్నారు.మిషన్ భగీరథకు సంబంధించి సి.యస్. మాట్లాడుతూ మే నెల చివరి నాటికి అన్ని గ్రామాలకు బల్క్ సప్లయి ద్వారా మంచినీరు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, సునీల్ శర్మ, పార్ధసారధి, ఆర్.వి.చంద్రవదన్, కార్యదర్శి బి.వెంకటేషం, పంచాయతీ రాజ్ కమీషనర్  నీతూ ప్రసాద్, ఆరోగ్య శాఖ  కమీషనర్ కరుణ,  సి.యం ఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, సి.యం.ఓ. ఓ.ఎస్.డి (హరితహారం) ప్రియాంక వర్గీస్ లతో పాటు ఇతర శాఖల అధికారులు  పాల్గొన్నారు.

Related Posts