YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలోకి కన్నా..

టీడీపీలోకి కన్నా..

గుంటూరు, జూన్ 21, 
కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో కంఫర్ట్ గా లేరు. ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత ప్రాధాన్యత కొరవడింది. పార్టీలో ఎటువంటి కీలక పదవులు లభించకపోగా, భవిష్యత్ లో కూడా బీజేపీ లో ఎటువంటి అవకాశాలు లేవు. కేంద్ర స్థాయిలోపదవులు కూడా దక్కే అవకాశం లేదు. మోదీ ప్రభుత్వంపై కూడా అసంతృప్తి బాగా పెరగింది. దీంతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో సీనియర్ నేత. ఆయనకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ. గుంటూరు జిల్లా నుంచి కాపు సామాజిక వర్గం నేతగా కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఎదిగారనడంలో సందేహం లేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి రావాలనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో బీజేపీ ఇచ్చిన ఆఫర్ కు తలొగ్గి ఆయన ఆ పార్టీలో చేరిపోయి అధ్యక్షుడిగా మారారు.బీజేపీలో ఉన్న ప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీిని టార్గెట్ చేసుకున్నారు. దీంతో పాటు జగన్ సీనియర్ నేతలకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం మంచిదన్న భావనలో ఉన్నారు. నిజానికి బీజేపీలో ఉండి టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ ఏర్పాటయితే తాను పోటీకి దిగవచ్చని ఆయన భావించారు. కానీ పార్టీ పెద్దలు టీడీపీతో జట్టు కట్టేందుకు అంగీకరించడం లేదు.దీంతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. టీడీపీలో అయితే ఖచ్చితంగా తనకు ప్రయారిటీ లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే మంత్రి పదవితో పాటు తనకు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత దక్కుతుందన్న యోచనలో ఉన్నారు. కాపు సామాజికవర్గం నుంచి బలమైన నేత రావడం చంద్రబాబుకు కూడా ప్లస్ పాయింటే. అందుకే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts