YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడపలో టిప్పు రాజకీయాలు

కడపలో టిప్పు రాజకీయాలు

కడప, జూన్ 21, 
ఎక్కడి మైసూరు రాజు టిప్పు సుల్తాన్. ఎక్కడి వివాదం, ఇపుడు కోరి ఆ రాజకీయ బురద అంటించుకోవడం అంటే వింతే మరి. కర్నాటకలో టిప్పు సుల్తాన్ మీద వివాదాలు ఉన్నాయి. ఆయన దీపావళి వేళ కొంత‌మంది అయ్యర్ల మీద దాడులు చేసి చంపాడని చెబుతారు. అయితే టిప్పు సుల్తాన్ కి మైసూర్ బెబ్బులి అని పేరు ఉంది. ఆయన బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసిన భారతీయ రాజుగానూ చరిత్రలో ఉంది. ఏది ఎలా ఉన్నా ఆయన మీద వివాదాలు అయితే చాలానే ఉన్నాయి. ఆయన పుట్టిన రోజుని చేయడానికి గత కన్నడ ప్రభుత్వ పాలకులు ప్రయత్నాలు చేసినపుడు బీజేపీ వ్యతిరేకించింది. ఇపుడు ఆ టిప్పు సుల్తాన్ ని ఏకంగా కడపకు తీసుకువచ్చారు. వైసీపీ నేతలే ఆయనకు నీరాజనాలు అర్పించడం మరో పొలిటికల్ ట్విస్ట్. ఏకంగా జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలోని పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి భూమి పూజ చేశారు. టిప్పు సుల్తాన్ ని గొప్ప దేశ భక్తుడిగా ఆయన అభివర్ణించారు. స్థానిక ముస్లిం సంఘాలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే వైసీపీ మద్దతు ఇచ్చింది. పైగా టిప్పుని కీర్తిస్తోంది. సరిగ్గా ఇక్కడే బీజేపీకి మండుకొస్తోంది. పైగా భలే చాన్స్ కూడా వచ్చిందని కమలం పార్టీ సై అంటోంది. కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. పైగా వైసీపీకి మైనారిటీల మద్దతు ఉంది. కానీ ఇపుడు టిప్పుని నెత్తికెత్తుకోవడంతో అనవసరమైన రగడను కోరి తెచ్చుకుంటున్నారా అన్నదే సొంత పార్టీలోనూ చర్చగా ఉంది.ఇంతకీ టిప్పు సుల్తాన్ కి కడపకు సంబంధం ఏంటి అంటే చరిత్రలో ఒక లింక్ ఉంది. టిప్పు సుల్తాన్ ని కన్న తల్లిది ఫాతిమాది కడప జిల్లావే. ఆమె కడప కోట గవర్నర్ నవాబ్ మొయినుద్దీన్ కుమార్తె. దాంతో ఇపుడు ఆ లింక్ ని అడ్డం పెట్టుకుని టిప్పు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముస్లిం వర్గాలు ఉబలాటపడితే వైసీపీ అండగా నిలబడింది. దీని మీద బీజేపీ గుర్రు మంటోంది. ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే ఇది మంచి పద్ధతి కాదు అంటూ హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ బదులుగా ఎందరో ముస్లిం నేతలు దేశం కోసం పోరాడిన వారు ఉన్నారు. వారి విగ్రహాలను పెట్టుకోండి అంటూ బీజేపీ నేతలు అంటున్నారు. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అన్నది బీజేపీ నేతల మాటగా ఉంది. మొత్తానికి అనంతపురం జిల్లాకు చెందిన బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి కూడా రంగ ప్రవేశం చేయడంతో ఇది పెద్ద వివాదంగా మారనుంది అంటున్నారు.ఇప్పటికే జగన్ మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. చాన్స్ దొరికితే చాలు జగన్ చర్చి అంటూ మాటల తూటాలు పేలుస్తారు. ఇక హిందువుల దేవాలయాలలో విగ్రహాలు వరసగా కూలగొట్టడం అన్నది కొన్నాళ్ల క్రితం వరకూ జరిగింది. ఆ మీదట అంతర్వేదిలో రధం దగ్దం అవడం కూడా జగన్ సర్కార్ కి ఒక మచ్చగా మిగిలింది. రామతీర్ధంలో కోదండ రాముడి శిరస్సు ఖండించి దుండగులు చేసిన అకృత్యం కూడా జగన్ సర్కార్ పరువు తీసింది. ఇలా హిందువుల మనోభావాలు కొంత వరకూ గాయపడినా వాటిలో వైసీపీ ప్రమేయం నేరురాఎంతో తేలనందువల్ల గమ్మున ఉన్నారు. ఇపుడు టిప్పు సుల్తాన్ ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటే వైసీపీ టొపారం లేచిపోయే విధంగానే రాజకీయ రచ్చ సాగుతుంది అంటున్నారు. మరి వైసీపీ నేతలు కొందరి అతి ఉత్సాహం వల్ల అటు ముస్లింలు, ఇటు హిందువుల మధ్యన పోరాట కధ సాగితే మాత్రం అంతిమంగా వైసీపీకే ముప్పు అవుతుంది అంటున్నారు

Related Posts