YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జంక్షన్ జామ్

జంక్షన్ జామ్

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి, జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేయటానికి నిర్మిస్తున్న బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ఉద్దేశం మారే విధంగా అనాలోచిత విధానాలు ముందుకు వస్తున్నాయి. ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ను పూర్తిగా మూసివేసే ఆలోచన చేస్తున్నారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు మొదటి నుంచి బాగానే ఉన్నా అప్రోచ్‌ పనుల్లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వైపు దిగాల్సిన అప్రోచ్‌కు సబ్‌వే లేద ని తెలుస్తోంది! ఏ1 పిల్లర్‌ నుంచి 300 మీటర్ల మేర ఏకబికిన వాల్‌ అప్రోచ్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. వాల్‌ నిర్మాణానికి కొంత మేర సైడు తవ్వారు. ఈ వాల్‌ ఎస్‌వీఎస్‌ జం క్షన్‌ దాటి ఇంకా ముందుకు వెళుతుంది. ఎస్‌వీ ఎస్‌ జంక్షన్‌ దగ్గర కానా (సబ్‌వే) వదులుతా రనుకుంటే అది లేదని తెలుస్తోంది. దీంతో పటమట లంక, లబ్బీపేట ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అప్రోచ్‌ ముందు, వెనుక జంక్షన్‌ను బదిలీ చేయటానికి అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి. చివర్లో తలెత్తిన ఈ గందరగోళంపై జాతీయ రహదా రుల సంస్థ బాధ్యత వహించి తగిన పరిష్కా రాన్ని చూపాల్సిన అవసరం ఉంది.

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో కీలక మైనవి జంక్షన్లు! ఈ జంక్షన్లను కవర్‌ చేస్తూ పైన ఫ్లై ఓవర్‌ వెళ్లాల్సి ఉంది. స్క్యూ బ్రిడ్జి నుంచి చూస్తే ఎస్‌వీఎస్‌, బెంజిసర్కిల్‌, నిర్మ లా, రమేష్‌ హాస్పిటల్స్‌ నాలుగు జంక్షన్లను ఫ్లై ఓవర్‌ కవర్‌ చేయాల్సి ఉంటుంది. మొదటి సారి ఫ్లై ఓవర్‌ను ప్రతిపాదించినపుడు నిర్మ లా కాన్వెంట్‌ జంక్షన్‌ వరకే ఫ్లై ఓవర్‌ డిజైన్‌ ఉంది. నగరాన్ని విభజిస్తున్న జాతీయ రహ దారులను ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు లేకుం డా తేలిగ్గా ఉండేలా అనుసంధానించటానికి ఉద్దేశించిన ఫ్లై ఓవర్‌ రద్దీ జంక్షన్లను కవర్‌ చేయకపోతే వచ్చే లాభమేమిటని అప్పట్లో ప్రజాప్రతినిధులు పోరాడారు. జాతీయ రహ దారుల శాఖ ఉన్నతాధికారులు పరిస్థితి చూ సి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ కూడా కవరయ్యేలా అదనంగా 800 మీటర్ల మేర ఫ్లైఓవర్‌ను పొడిగించారు. ఫ్లై ఓవర్‌ పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించి చక చకా పూర్తిచేస్తోంది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో అప్రోచ్‌ రోడ్డు వ్యవహారం తలనొప్పి తెస్తోంది.

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పిల్లర్‌ (పీ 1) వెనుక అప్రోచ్‌ రోడ్డు కోసం ఏ1 పిల్లర్‌ వేశారు. ఏ1 పిల్లర్‌ ఎస్‌వీఎస్‌ కల్యాణ మండపం అవతలే ఉంది. అదే కాస్త ముందు ఉంటే సమస్య వ చ్చేది. ఏ 1 పిల్లర్‌ దూరంగా ఉండటంతో అ ప్రోచ్‌ రోడ్డుతో మూసుకుపోతుందని స్థానికు లు భావించి దీనిపై పెదవి విరుస్తున్నారు. మరోవైపు సబ్‌వే ఏర్పాటు చేస్తారేమోనని బహిరంగంగా విమర్శించకుండా సరిపుచ్చు కుంటున్నారు. తీరా చూస్తే 300 మీటర్ల పొడ వునా వాల్‌ అప్రోచ్‌ మాత్రమే ఉంటుందని, సబ్‌వే ఉండదని తెలుస్తోంది. దీంతో కొత్త సమస్య వచ్చి పడింది. అప్రోచ్‌ వాల్‌తో ఎస్‌వీ ఎస్‌ జంక్షన్‌ మూసుకుపోయే పరిస్థితి వస్తుం ది. కాగా జంక్షన్‌ను ముందుకు జరపవచ్చను కుంటే పెద్ద సమస్యే ఉంది. అప్రోచ్‌ దిగే ముందు బందరు కాల్వపై స్క్యూ బ్రిడ్జి ఉంది. కాబట్టి జంక్షన్‌ను ముందుకు మార్చటం అసా ధ్యం. ఏ1 పిల్లర్‌ దిగువకు జంక్షన్‌ను మార్చ టం కూడా సంక్లిష్టంగా ఉంది. రోడ్డుకు అవ తల వైపు జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌ పక్కన రోడ్డు అనుకూలంగానే ఉంది. కానీ ఎస్‌వీఎస్‌ వైపు రోడ్డు అనుసంధానం కావటానికి వీలు లేదు. జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద కూడా సమస్య ఉంది. అదేమిటంటే బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ రెండు వరసల సమాహారం. రెండో వర సకు ఇంకా టెండర్లు పిలవలేదు. పనులు చేప ట్టడానికి సమయం పడుతుంది. అప్పటి వర కు హైవేను రెండో భాగంలో కట్‌ చేయటం, జంక్షన్‌ డైవర్షన్‌ చేయటానికి కూడా సమస్య ఏర్పడుతుంది.

ఏ1 పిల్లర్‌ వెనుక ఫ్లై ఓవర్‌ కింద నుంచి జంక్షన్‌ డైవర్షన్‌ చేద్దామనుకున్నా సమస్యలు ఉన్నాయి. పటమట, పటమట లం క ప్రాంత ప్రజలంతా ఎస్‌వీఎస్‌ కల్యాణ మం డపం సందు నుంచి జంక్షన్‌ వైపునకు వస్తా రు. వీరు మళ్లీ బెంజిసర్కిల్‌ వైపు తిరిగి ఏ 1 ఖానా కింద నుంచి మళ్లీ హైవే మీదుగా ఎస్‌ వీఎస్‌ జంక్షన్‌కు వెళ్లాలి. ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ నుంచి వచ్చే వారికి అప్రోచ్‌ వాల్‌ అడ్డంగా ఉండటం వల్ల వీరంతా హైవే మీదుగా మళ్లీ బెంజిసర్కిల్‌ వచ్చి అక్కడి నుంచి పటమట ఎన్టీఆర్‌ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. తూ ర్పు నియోజకవర్గం కాస్తా ఇప్పటికే జాతీయ రహదారి వల్ల రెండుగా విడిపోయి రాకపోక లకు కష్టసాధ్యంగా మారింది. ఎస్‌వీఎస్‌ వంటి ముఖ్యమైన జంక్షన్‌ వద్ద అప్రోచ్‌కు అను సరిస్తున్న విధానం సమస్యను సృష్టిస్తోంది.

Related Posts