YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి        హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వ‌ర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మే డే సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. కార్మికులకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని నాయిని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోసం ప్రజలు ధర్నాలు చేసిన్రని, ప్రభుత్వ చేతిగానితనం వల్ల పవర్‌ హాలీడేలు ప్రకటించిన్రని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పవర్ హాలీడే వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని కేటీఆర్ మండిపడ్డారన్నారు. కేవలం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చినట్లు వెల్లడించారు. అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నమన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు.పేదల ఆత్మగౌరవం పెంపొందించేలా డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం చేపట్టినట్టు కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్, టీడీపీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల గుండెల్లో నిండుగా ఉన్న కేసీఆర్‌ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, మేయర్ రామ్మోహన్, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Related Posts