YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కలెక్టర్‌లతో సీఎం కేసీఆర్‌ కాళ్ళు మెక్కించు కోవడం సిగ్గుచేటు: బండి సంజయ్

కలెక్టర్‌లతో సీఎం కేసీఆర్‌ కాళ్ళు మెక్కించు కోవడం సిగ్గుచేటు: బండి సంజయ్

హైదరాబాద్ జూన్ 21
కలెక్టర్‌లతో కాళ్ళు మెక్కించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌కు రావటం సిగ్గుచేటు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కలెక్టర్ తీరుతో దేశంలోని ఐఏఎస్ అధికారులంతా సిగ్గు పడుతున్నారన్నారు. హుజురాబాద్‌‌లో టీఆర్ఎస్‌‌కు అభ్యర్థి లేరన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. హుజురాబాద్‌లో వార్‌ వన్‌ సైడే బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ పేర్కొన్నారు. ఉద్యమకారుడు ఈటల బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.బీజేపీలో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటలను తాను దగ్గర్నుంచి చూశానన్నారు. ఉద్యమ సమయంతోపాటు ఇప్పుడు కూడా ఉద్యమకారులకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఈటల ఆదుకున్నారని ప్రశంసించారు. ‘ఉద్యమంలో ఈటల రాజేందర్‌ది కీలక పాత్ర. అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్‌‌లో ఎలాంటి అవమానం జరిగిందో మనందరికీ తెలిసిందే. టీఆర్ఎస్‌లో ఇకపై ఉద్యమకారులెవరూ ఉండబోరు. మాజీ ఎంపీ వివేక్, స్వామి గౌడ్, ఈటల రాజేందర్ వంటి చాలా మంది ఉద్యమకారులు బీజేపీలో చేరారు. ఇంకా మిగిలిన ఉద్యమకారులు అందరూ భవిష్యత్‌‌లో బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేదా? తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు పలికింది. ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అవ్వగానే కేసీఆర్‌‌కు భయం పట్టుకుందన్నారు.కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై  చిత్తశుద్ధి లేదని..కనీసం వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. ఫ్రీ వ్యాక్సిన్ ఫ్లెక్సీపై ప్రధాని ఫోటో కూడా పెట్టాలనే  ఇంగిత జ్ఞానము లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్‌కు పట్టింపు లేదన్నారు. కేసీఆర్‌కు రాజకీయ జిమ్మిక్కిలు తప్ప, ఫ్రీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని సోయి లేదని బీజేపీ అధ్యక్షుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతీయువకుల ఆరోగ్యంతో  సీఎం కేసీఆర్ చేలాగాటమాడుతున్నారన్నారు. ఫ్రీ వ్యాక్సిన్ కృతజ్ఞతకు కూడా మోదీ ఫోటో పెట్టాలేదన్నారు. ఫ్రీ వ్యాక్సిన్‌పై ఇంత వరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకోని అసమర్థ సీఎం అని వ్యాఖ్యానించారు. 2500 కోట్లు ఇస్తా అన్నావు ఏమైందని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడుదామని పిలుపునిచ్చారు. యుద్ధ ప్రాతిపదికన 18 సంవత్సరాలు నిండిన అందరికీ  వ్యాక్సిన్ ఇవ్వాలని వెంటనే  ఉత్తర్వులు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts