YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళితుల సాధికారత అంటే పోలీస్ స్టేషన్ లో కొట్టి, హింసించి చంపడమా? ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగిన భట్టి

దళితుల సాధికారత అంటే పోలీస్ స్టేషన్ లో కొట్టి, హింసించి చంపడమా? ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగిన భట్టి

ఖమ్మం, జూన్ 21
పోలీస్ స్టేషన్ లో కొట్టి, హింసించి చంపితే.. సిగ్గులేని ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫెరెన్స్ పెట్టి దళితుల సాధికారత కోసం నా ప్రభుత్వం అని చెబుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడైన నా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి తీసుకెళ్లి తెల్లవార్లు చంద్ర శేఖర రావు నీకు బుద్ది ఉందా?అని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  తీవ్ర స్థాయిలో విమర్శించారు.నువ్వు మనిషివి అయితే మరియమ్మను కొట్టి చంపిన వారిమీద చర్యలు తీసుకోకుండా ఉన్న నీ ప్రభుత్వంలో సామాన్యుల బతుకు ఏమిటో అర్థం అవుతోంది.నువ్వూ..నీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సామాన్యులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులూ తుంగలో తొక్కబడ్డాయి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. నీకు శిక్ష తప్పదు కేసీఆర్ అని హెచ్చరించారు. మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడానికి చెందిన మ‌రియ‌మ్మ‌, ఆమె కుమారుడు ఉద‌య్ కిర‌ణ్ ను  భువ‌న‌గిరి జిల్లా అడ్డ‌గూడూరుకు చెందిన పోలీసులు ఈ నెల 16న వారిని పిక‌ప్ చేసుకునివెళ్లి.. అడ్డ‌గూడూరు స్టేష‌న్ లో గొడ్డునుబాదిన‌ట్టు బాద‌డం అత్యంత బాధాక‌రం. నాలుగు రోజులపాటు కొట్టిన చోట కొట్టకుండా కొట్టడం బాధాకరమని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.నేడిక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈనెల 17న మ‌ళ్లీ మ‌రియ‌మ్మ‌ను చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడెం తీసుకువ‌చ్చి గ్రామ‌స్థులంతా చూస్తుండ‌గా.. చింతకానీ పోలీస్ స్టేషన్ లో వదిలేస్తామని చెప్పి, చింతకానీ కాకుండా కొనిజర్ల తీసుకువెళ్లి.. కుమార్తె ముందే మరియమ్మును శారీరకంగా హీంసించడం సోచానేయమన్నారు అక్కడ నుంచి రాత్రి 10.30 ప్రాంతంలో చింతకానీ స్టేషన్ కు తీసుకువచ్చి, చాటిబిడ్డతో ఉన్న కుమార్తె ముందు రాత్రంతా పైన గదిలో నాలుగు కానిస్టేబుల్స్ (మహిళా కానిస్టేబుల్ లేకుండా) ఒకరి తరువాత ఒకరు ఒళ్ళు హూనం అయ్యేట్లు లాఠీలతో కొట్టారు.  దెబ్బలకు తాళలేక మరియమ్మ అరుస్తున్న అరుపులు వినే నాథుడే లేడు. మా అమ్మను కొట్టకండి.. మా అమ్మను చంపకండి అని కుమార్తె ఎంత ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించలేదన్నారు. చివరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో మరియమ్మను చింతకానీ నుంచి అడ్డగూడూరు స్టేషన్ కు తరలించి అక్కడ కూడా విపరీతంగా కొడితే.. దెబ్బలు భరించలేక మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చేతుల్లో పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు విడిచిందన్నారు. నా చేతుల్లోనే మా అమ్మ చనిపోయిందని ఉదయ్ కిరణ్ చెబుతుంటే ఎంత బాధాకరంగా ఉంది. ఈ ఘటనను భట్టి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో అర్థం అవుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్ల సామాన్యులు ఎవరూ బతికే పరిస్థితి లేదు. పౌర హక్కుల లేవు. ప్రజల మీద విశృంఖలంగా పోలీసుల దాస్తీకాలు పెరిగిపోతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి దళిత గిరిజనులు పోలీసుల చేత చంపబడుతున్నారు. అయిన ఇంతవరకూ ఎక్కడ న్యాయం జరగ లేదు.మరియమ్మను చంపిన, ఆమె కొడుకును గొడ్డును బాదినట్లు బాదిన పోలీస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకా ఈ ఉదంతాన్ని బయటకు రాకుండా చేసిన వారిపైనా.. పోలేసులపైన అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అట్రాసిటీ యాక్ట్ ప్రకారం, ఇందిరాగాంధీ కల్పించ చట్టారక్షణల ప్రకారం బాధిత కుటుంబానికి రావలసిన అన్ని సదుపాయాలు తప్పకుండా రావాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.. చట్టప్రకారం రావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని,ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ వెంటనే పూర్తి సమాచారం తెప్పించుకుని.. భాదితులకు న్యాయం చేయడంతో పాటు దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ఏ స్థాయికైనా వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.అవసరమైతే న్యాయస్థానాలను, గవర్నర్ ను కలుస్తాం. ముఖ్యమంత్రిని నేను కలిస్తాను. మీడియా ద్వారా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. దళితులపై పోలీసులు చేస్తున్న దాస్థీకలను కట్టడి చేయకపోతే తిరుగుబాటు తప్పదు. భట్టి విక్రమార్కతో పాటు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ జావీద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, ఎస్సీ రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు

Related Posts