గుంటూరులో మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు వున్న ఎండ స్థానంలో వాన చినుకులు కురిసాయి. మబ్బులు పట్టడంతో గుంటూరు మొత్తం చీకటి మాయంగా మారిపోయింఆది. ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపివేయడంతో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. నగరవాసులు అయోమయంలో పడిపోయారు. కాసేపటికి కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు పూర్తి స్థాయిలో జల మాయమైయాయి. ఆకాశంనుంచి భారీ శబ్దాలు రావడంతో నగరం దద్దరిల్లింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుడా గుంటూరు లో పరిస్థితి పై అరా తీసారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసారు.