YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జీహెచ్ ఎంసీ అధికారులపై చర్యకు డిమాండ్

జీహెచ్ ఎంసీ అధికారులపై చర్యకు డిమాండ్

ఎలాంటి పరిపాలన అనుమతులు లేకుండా, టెండర్లు పిలువకుండానే లక్షలాది రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జీ పటోళ్ల కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నాడు అయన రాజేంద్రనగర్ సర్కిల్ లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడారు. వేరో చోట మంజూరైన నిధులతో మరోచోట నిర్మాణ పనులు చేపట్టిన కంట్రాక్టరు ను బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అధికారులు ఎమ్మెల్యే కు వత్తాసు పలుకుతున్నారని అత్తాపూర్ లో రోడ్డు కోసం మంజూరైన నిధులను ఎమ్మెల్యే కూతురు నూతనంగా నిర్మించిన ఇంటిముందర రోడ్డు నిర్మాణం చేపట్టడం నిధులు అధికార దుర్వినియోగమే అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి నిధులు దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం తోపాటు కంట్రాక్టరు ను బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల లో తగిన చర్యలు తీసుకోకపోతే వచ్చే సోమవారం రోజున రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కార్తీక్ రెడ్డి హెచ్చరించారు

Related Posts