YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మద్దాలి గిరికి కలిసొస్తున్న కాలం

మద్దాలి గిరికి కలిసొస్తున్న కాలం

గుంటూరు, జూన్ 22, 
గుంటూరులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు ప‌శ్చిమం. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్త ప్రభంజ‌నంలోనూ ఇక్కడ వైసీపీ పాగా వేయ‌లేక పోయింది. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక పోయింది. అమ‌రావ‌తిలోనే కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన ఈ ప‌శ్చిమంలో వైసీపీ త‌ర‌ఫున 2014లో లేళ్ల అప్పిరెడ్డి, 2019 చంద్రగిరి ఏసుర‌త్నం పోటి చేశారు. అయితే.. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ ఈ ఇద్దరు నేత‌లు ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రి ఇక్కడ గెలిచేది ఎలా? అనేది వైసీపీ నేత‌ల మాట‌. ఈ క్రమంలోనే విజ‌య‌వాడ‌కు చెందిన మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు స‌న్నిహితుడు, టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌ను పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు.అధికారికంగా ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకోక‌పోయినా.. వైసీపీ అనుకూల నేత‌గానే చ‌లామ‌ణి అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ద్దాలి గిరికే ఇక్కడ టికెట్ ఇచ్చే అవ‌కాశం మెండుగా ఉంటుంది. అయితే నిన్నటి వ‌ర‌కు ప‌శ్చిమ వైసీపీలో ఆ ప‌రిస్థితి లేదు స‌రిక‌దా ? మూడు ముక్కలాట కొన‌సాగింది. మ‌ద్దాలి గిరికి పార్టీలో ప్రయార్టీ ఇస్తే ఇప్పటి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని డెవ‌ల‌ప్ చేసిన‌.. లేళ్ల అప్పిరెడ్డి ప‌రిస్థితి ఏంటి ? గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌నకు సీటు ఇవ్వలేదు క‌దా ? అప్పిరెడ్డి ఫ్యూచ‌ర్ క‌ష్టమేనా అన్న అనుమానాల నేప‌థ్యంలో జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు.మ‌ద్దాలి గిరికి పోటీ లేకుండా చేసేందుకు.. ఇంకెవ‌రూ ఆయ‌న‌తో రాజ‌కీయ ర‌గ‌డ‌కు దిగ‌కుండా చూసేందుకు జ‌గ‌న్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. గ‌వ‌ర్నర్ కోటాలో లేళ్ల అప్పిరెడ్డిని శాస‌న మండ‌లికి పంపేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఆరేళ్ల వ‌ర‌కు కూడా లేళ్ల అప్పిరెడ్డి మండ‌లి స‌భ్యుడిగానే కొన‌సాగనున్నారు. సో.. ప‌శ్చిమలో ఆయ‌న పోటీకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓడిన‌ చంద్రగిరి ఏసుర‌త్నంకు ఇప్పటికే గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ ప‌ద‌విని అప్పగించారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో నిన్నటి వ‌ర‌కు మూడు ముక్క‌లాట‌గా కొన‌సాగిన వార్‌కు తెర‌ప‌డింది. అప్పిరెడ్డితో పాటు ఏసుర‌త్నం కూడా ఇక్కడ మ‌ద్దాలి గిరికి పోటీకి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో మ‌ద్దాలి గిరికే ప‌శ్చిమ వైసీపీ సీటు రిజ‌ర్వ్ అయింద‌న్న చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి

Related Posts