కర్నూలు
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. . కర్నూలు 6వ అదనపు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రతినెలా రెండు, నాలుగో శనివారాలు బనగానపల్లి పోలీసుస్టేషన్లో హాజరై సంతకాలు చేయాలన్న షరతుతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. గత నెలలో బనగానపల్లిలో జరిగిన ఘర్షణ కేసులో బీసీ జనార్దన్రెడ్డితోపాటు ఆయన అనుచరులు శీను, దివాకర్, విజయారెడ్డి, పెద్ద ఉశేని, మురళీమోహన్రెడ్డి, రమణ, నరసింహ, అత్తర్ సాహెబ్తోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆదోని సబ్ జైలులో బిసి ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం బెయిల్ మంజూరైంది. ఆ రోజే సాయంత్రం రిలీజ్ అవ్వాలి అయితే సమయం దాటిపోవడంతో మంగళవారం ఉదయం రిలీజ్ అయ్యారు. అధికారం తో కేసులు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బిసి అన్నారు. మరోవైపు బనగానపల్లె పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.