YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ

 ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీ

శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా స్థానికులు శాంతియుతంగా ర్యాలి నిర్వహించారు.  తమ వాహనాలను ఫోటోలు తీసి వేల రూపాయల చాలాన్లు విధిస్తున్నారని వారి అరోపణ.  శంషాబాద్ లో పార్కింగ్ స్థలం చూయించకుండా డ్రైవింగ్ లో ఉన్న వాహనాలకు సైతం  ఫోటోలు తీసి చాలాన్లు పంపుతున్నరని వారు నినాదాలు చేసారు.  ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సహాంతో పంపుతున్న చాలాన్లు  తమ నడ్డి విరుస్తున్నాయంటూ శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను వదిలేసి కేవలం చలాన్లే తమ విధిగా బావిస్తున్నారని ఆరోపించారు. ఎయిర్ పోర్టు కు ముఖద్వారం లో ఉన్న శంషాబాద్ లో వాహనాల పార్కింగ్ కోసం ఏమాత్రం స్థలం కేటాయించని అధికారులు అక్రమ పార్కింగ్ అంటూ చలాన్ విదిస్తున్నారని వారు విమర్శించారు. డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ ఉంటే ఛలాన్ విదించకూడదు అనే నిబంధన ఉన్నా అది తమకేమీ సంబంధం లేదని ఆన్ లైన్ చలాన్ పంపుతున్నరని ఆరోపించారు. కోర్టుల చుట్టూ తిరుగలే, క తమ తప్పు లేదని తెలిసినా ఛలాన్ కట్టేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.   పోలీసులకు వ్వతిరేకంగా శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.తరువాత అధికారులకు  వినతిపత్రం అందించారు.

Related Posts