మహిళ సాధికారతకు వైఎస్సార్ చేయూత పథకం ఎంతో తోడ్పడుతుందని, అక్కచెల్లెమ్మలకు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత పథకం రెండో విడత కార్యక్రమాన్ని తన నివాసంలో ని ప్రారంభించారు. లబ్ధిదారులకు అర్హత పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో మహిళ కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు "వైఎస్సార్ చేయూత" పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న మాటకు కట్టుబడి నెరవేర్చడం జగన్మోహన్ రెడ్డి తత్వమన్నారు. రెండేళ్ల లో 90 శాతం హామీలను నెరవేర్చడం దీనికి నిదర్శనమని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ఏడాది 23,14,342 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 4,339.39 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. అందులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణం నందలి ఈ పథకం ద్వారా 4064 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,62,000.00 కోట్లు, ఒక్కొక్కరికి రూ. 18,750 లు జమ అయిన ఈ డబ్బును అక్కాచెల్లెమ్మలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.