YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నకు బ్యాడ్ టైమ్ స్టార్టైందా...

 అచ్చెన్నకు బ్యాడ్ టైమ్ స్టార్టైందా...

శ్రీకాకుళం, జూన్ 23, 
ఒకసారి తప్పు జరిగిపోతే ఇక దిద్దుబాటు చేసుకోవడం కష్టం. అందులో నమ్మకంగా ఉన్న నేతలు పార్టీ అధినాయకత్వాన్నే థిక్కరించి మాట్లాడితే ఆయనకు ఫ్యూచర్ ఉండదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలో అదే జరుగుతుంది. చంద్రబాబు, లోకేష్ లు అచ్చెన్నాయుడును ఇప్పటికిప్పుడు దూరం పెట్టకున్నా, భవిష్యత్ లో మాత్రం ఆయనను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే అచ్చెన్నాయుడు గతంలో మాదిరి ప్రాధాన్యత దక్కడం లేదు.తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా దూషిస్తూ అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు పార్టీని ఇరకాటంలోకి పడేసింది. టీడీపీకి ఇక భవిష్యత్ లేదని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇవి తన మాటలు కాదని అచ్చెన్నాయుడు పూర్తిగా ఖండించలేదు.అయితే ఇటీవలే అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పైగా ఆయనపై ఈఎస్ఐ కేసు నమోదు కావడం, అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో లోకేష్ వద్దంటున్నా చంద్రబాబు అచ్చెన్నాయుడుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే తిరుపతి ఘటన తర్వాత లోకేష్ అచ్చెన్నాయుడుకు పూర్తిగా దూరమయినట్లు తెలుస్తోంది. కనీసం ఫోన్ లో కూడా పలకరింపులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఏదైనా మీటింగ్ లో తప్ప ప్రత్యేకించి అచ్చెన్నాయుడుతో మాట్లాడిన సందర్భాలు లేవు.చంద్రబాబు, లోకేష్ లు అచ్చెన్నాయుడుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇది సమయం కాదని వేచి చూస్తున్నారు. దీనికితోడు అచ్చెన్నాయుడు ప్రత్యర్థి కళా వెంకట్రావు సయితం తిరుపతి ఘటన మర్చిపోకుండా పార్టీ హైకమాండ్ కు గుర్తు చేస్తుండటం కూడా ఆయనపై ఆగ్రహం చల్లారలేదంటారు. అచ్చెన్నాయుడు పదవికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా ఆయన కంటే ఇతర సీనియర్ నేతలకే ప్రాధాన్యత ఇస్తూ పక్కన పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Related Posts