విజయనగరం జూన్ 23
సీఎం జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. సంక్షేమం అంటే డబ్బు ఇవ్వడం కాదన్నారు. ఓట్ల కోసమే జగన్ పాలన చేస్తున్నారని విమర్శించారు. విభజన భాగంలో విడిపోయి ఏపీ నష్టపోయిందని తెలిపారు. ఉద్యోగాలు కల్పించే పరిశ్రమల స్థాపనకు డబ్బులు లేవని అంటారని...కేంద్ర సహకరం చేస్తుందని చెప్పినా సహకరించలేదన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అన్యాయమన్నారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వ్యాఖ్యానించారు. విభజన హామీల విషయంలో చర్చలకు బీజేపీ సిద్ధమని స్పష్టం చేశారు. ఏమి ఇవ్వలేదు...ఏమి ఇచ్చిందో వారికే తెలియజేస్తామని తెలిపారు. కృష్ణ, గోదావరి నీటి విషయంలో తెలంగాణ వాళ్లు అడ్డుకున్నారని చెప్పారు. పోలవరం ముంపు మండలాల కోసం బీజేపీ పోరాటం చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ వాల్లే ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నారన్నారు. ఆనాడు ఏపీని తాకట్టు పెట్టారని....తద్వారా అనేక విధాలుగా నష్టపోయామని తెలిపారు. తెలంగాణ విడిపోయి కూడా ఆంధ్రులను శత్రువులుగా చూస్తున్నారని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పెండింగ్‌లో ఉందని... పక్కన ఉన్న వంశధార పెండింగ్‌లో ఉందని...దీని గురించి ఎవరు మాట్లాడరని సోము వీర్రాజు మండిపడ్డారు.