YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

జీఎస్టీ తొలిసారి రూ.లక్ష కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.1.03 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. గతేడాది జులైలో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మేర వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.సెటిల్‌మెంట్‌ అనంతరం ఏప్రిల్‌ నెలకు గాను సీజీఎస్టీ కింద కేంద్రం రూ.32,493 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రాష్ట్రాలకు రూ.40,257 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కాంపోజిషన్‌ డీలర్లకు సంబంధించి త్రైమాసిక ఫైలింగ్‌కు కూడా ఇదే నెల గడువు కావడం గమనార్హం. మొత్తం 19.31 లక్షల మంది డీలర్లలో 11.47 లక్షల మంది క్వార్టర్లీ రిటర్నులు (జీఎస్టీఆర్‌ 4) సమర్పించారని తెలిపింది. ఏప్రిల్‌ నెలకు గాను వసూలైన 1.03 లక్షల కోట్లలో వీరు రూ.579 కోట్లు చెల్లించారని ఆ శాఖ పేర్కొంది.017 ఆగస్టు నుంచి 2018 మార్చి వరకు రూ.7.19 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలయ్యాయి. అంటే నెలకు సరాసరి రూ.89,885 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ అమలైన గతేడాది జులైతో కలుపుకుంటే రూ.7.41 లక్షల కోట్లు వసూలయ్యాయి.

Related Posts