YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూలై 1 నుంచి నయా రూల్స్

జూలై 1 నుంచి నయా రూల్స్

హైదరాబాద్, జూన్ 23, 
జూన్ నెల చివరకు వచ్చేశాం. ఇక జూలై నెలలోకి ఎంట్రీ ఇవ్వడానికి మరో వారం రోజులు ఉన్నాయి. కొత్త నెల రావడంతోపాటు కొత్త రూల్స్‌ను కూడా తీసుకువస్తోంది. జూలై 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. వచ్చే నెల నుంచి ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ముందే తెలుసుకోవడం ఉత్తమం.
1. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన మారుతూ ఉంటాయి. వచ్చే నెల కూడా ఇదే జరగొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో సిలిండర్ రేటు స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
2. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కొత్త రూల్స్ తీసుకువస్తోంది. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ మారనున్నాయి. చార్జీలు పెంచింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ కొత్త నిబంధనలను వర్తిస్తాయి.
3. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని వారు ఈ నెలలోపు ఈ పని పూర్తి చేయాలి. లేదంటే జూలై 1 నుంచి డబుల్ టీడీఎస్ చెల్లించుకోవాల్సి వస్తుంది.
4. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు వచ్చే నెల నుంచి చెల్లవు. కొత్తగా కెనరా బ్యాంక ఐఎఫ్ఎస్‌డీ కోడ్లు ఉపయోగించాలి. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం వీలు కాదు.
5. మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో కొత్తగా వెహికల్ కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

Related Posts