రాజోలు
సఖినేటిపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో జరిగిన కుంభకోణంలోవిచారణ చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. బ్రాంచితోపాటు, సంబంధిత ఉద్యోగి నివాస గృహాం తోపాటు మరో నాలుగు చోట్ల సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కోటి రూపాయల దాటిన కుంభకోణాలను సిబిఐ కి ఇవ్వాలని ఉన్న ఆర్బీఐ నిబంధనల మేరకు ఎస్బీఐ ఉన్నతాధికారులు సిబిఐ కి పిర్యాదు చేసారు. బ్యాంకు అధికారుల ప్రాధమిక విజిలెన్స్ విచారణలో 6.8 కోట్ల రూపాయలు కుంభకోణం గా ఆధారాలుతో విచారణాధికారులు గర్తించారు. 40 ఏళ్ళ క్రితం ప్రారంభించినఈ బ్రాంచ్ ఖాతాదారుల మన్ననలు పొందింది. ఖాతాదారులు 400 కోట్లరూపాయల పైబడి లావాదేవీలు జరిపారు. రాజోలు దీవిలో అత్యధిక లావాదేవీలు జరిగే రెండవ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇది. రెండు సంవత్సరాలు ఆడిట్ జరిగినా బయటపడని వైనం పై ఉన్నతాదికారుల ప్రమేయం పైనా అనుమానాలు వ్యక్తం అవుతుననాయి.