నా ప్రియాతి ప్రియమైన యువజనులారా, నాన్న కొనిచ్చిన సెల్ ఫోన్‌లో పిచ్చి వీడియోలు చూడటం ఆపు, ఆ బైక్ మీద పనికి రాని సరదా షికార్లు ఆపు, ఆలోచించు ఏం చేయగలవో ఆంధ్రా ప్రత్యేక హోదా కోసం, నాయకులున్నారుగా వాళ్లు తెస్తారులే మన కోసం అనుకోవద్దు, ఏదో వాళ్లే చేయాలని కోరుకోరుకోవద్దు.. తెలంగాణ ఉద్యమం తరహాలో, ఇండియా ఇండిపెండెన్స్ కోసం మహానుభావులు కష్టపడిన తరహాలో నిరసన ఉధృతం చేయండి.. నేను సాధించేవరకు వదలను, పనికి రాని వాటి పై ప్రేమ, అభిమానాలు వదిలిపెట్టి ఆంధ్రా కోసం పోరాటం చేద్దాం' అంటూ హోదా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీసింది శ్రీరెడ్డి.నిన్నటి వరకూ క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ఆ తరువాత పవన్ కళ్యాణ్‌పైన ఆయన కుటుంబం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తనకు కావాల్సినంత పాపులారిటీ సాధించిన శ్రీరెడ్డి కొత్త ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకుంది. హోదా రాకపోవడానికి యువతే కారణం అన్నట్టుగా పనికిమాలిన పోస్ట్‌లు పెడుతూ యువత ఆగ్రహానికి కారణమైంది. ప్రత్యేక హోదా అనేది తమ బాధ్యతగా భావించని యువత కారణంగానే ప్రత్యేక హోదా రావట్లేదు. ఎండకి కందకుండా, టీవీ, సెల్ ఫోన్ వదలకుండా, కాలేజీకి బంక్ కొట్టి పోరాటాలు చేయకపోతే ఎలా వస్తుంది? అమ్మాయిలు 100శాతం బయటకొస్తారని నమ్ముతున్నా.. ప్రతీది ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్లాన్స్ చేయండి ఆంధ్రా కోసమే ఏం చేయగలమో' అంటూ పొలిటికల్ లీడర్స్ మించిపోయి మరీ స్పీచ్‌లు ఇస్తుంది శ్రీరెడ్డి. ఇక్కడ శ్రీరెడ్డి గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా యువతను రెచ్చగొట్టడం మాని తన పాత పని తాను చూసుకుంటే మంచిది. యువత పోరాట చేస్తేనే హోదా వస్తుందంటూ నోటికొచ్చినట్టు పేలకుండా కాస్త ఆలోచించి మాట్లాడితే అందరికీ శ్రేయస్కరం. శ్రీరెడ్డి భావించినట్టుగానే యువత చదువు, కుటుంబాలను వదలి రోడ్డెక్కి పోరాటం చేస్తారు. హోదా వచ్చిన తరువాత వాళ్ల జీవితాలు మారతాయని శ్రీరెడ్డి భరోసా ఇస్తుందా? అసలు శ్రీరెడ్డి ఎవరు? ఆమె భరోసా ఇచ్చినా అది ఎవరికి కావాలి? అసలు ప్రత్యేక హోదా కోసం విద్యార్థులకు పిలుపు ఇచ్చేందుకు ఈమెకు ఉన్న అర్హత ఏమిటి? హోదా సాధన ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న శ్రీరెడ్డి.. ఇన్నాళ్లు హోదా ఇస్తామని ఒకరు, హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజ్ చాలు అంటూ నాలుగున్నరేళ్లు గడిపి ఇప్పుడేమో హోదానే ముద్దు అంటూ నిరసన చేస్తుంటే ఈ స్వార్థ రాజకీయాలకు వంత పాడాలంటూ యువతను రోడ్డుపైకి రావాలంటూ పిలుపును ఇవ్వడం ఎంత వరకూ కరెక్ట్. అసలు ఉద్యమాన్ని సక్రమంగా నడిపించే నాయకుడు ఎక్కడ ఉన్నాడు? అధికార, ప్రతిపక్షపార్టీలు నాలుగున్నరేళ్లు పూర్తైతేనే కాని కళ్లు తెరవలేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఎన్నికలు సమీపిస్తేనే కాని కానరాలేదు. ఇప్పుడు వాళ్లను నమ్మి ఉద్యమం చేయండి. చదువులు వదిలేయండి.. కుటుంబాలు వదిలేయండి.. అంటూ నోటికొచ్చినట్టు పోస్ట్ పెట్టడం ఆపి.. విద్యార్థుల్ని రెచ్చగొట్టకుండా వాళ్ల జీవితాలను నాశనం చేయకుండా ఉంటే మంచిది శ్రీరెడ్డి.