YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రైలు మార్గం ద్వారా సొంతూరుకి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

రైలు మార్గం ద్వారా సొంతూరుకి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

న్యూఢిల్లీ జూన్ 24
రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ కన్పూర్‌లోని తన స్వస్థలం పారౌఖ్‌కు వెళ్లనున్నారు. రైలు మార్గం ద్వారా సొంతూరుకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన పరిచయస్తులతో పాటు కలిసి చదువుకున్న పాఠశాల మిత్రులను కలువనున్నారు. అయితే, 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే రాంనాథ్‌ కోవింద్‌ సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.ప్రత్యేక రైలు శుక్రవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి.. సాయంత్రం కాన్పూర్‌ చేరుకుంటుంది. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. ఇక్కడ నాటి పాత పరిచయస్తులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు. ఇంతకు ముందు 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. అక్కడ ఇండియన్‌ మిలటరీ అకాడమీ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. అలాగే దేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సైతం తరచూ రైలు ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజేంద్రప్రసాద్ బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని తన జన్మస్థలమైన జిరాడీని సందర్శించారు. ఛప్రా నుంచి ప్రత్యేక రైలులో ప్రయాణించారు.

Related Posts