విశాఖపట్నం
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి దేవాలయం ఈఓ ఆదేశాల మేరకు ఆలయంలోపలకు స్టాప్ మొబైల్స్ నిషేధించి ... వారికి గాలిగోపురం పక్కన ప్రత్యేకంగా లాకర్ సదుపాయం కల్పించారు. అర్చకులు ఇతర సిబ్బంది ... ఈ లాకర్ సదుపాయం వినియోగించుకుని బ్యాగులు, మొబైల్ ఫోన్లు అందులోనే పెట్టుకోవాలని ఈఓ సూర్యకళ కోరారు. ఎవరి లాకర్ కు వారు తాళం వేసుకోవచ్చన్నారు. భక్తులుకూడా తమ మొబైల్స్ , బ్యాగులు ఉంచేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయం లాగే... సింహాచలం దేవస్థానంలోనూ సెల్ ఫోన్లు అనుమతించబోమని ... ఎవరూ వీడియోలు తీసి మార్ఫింగులు చేయడానికి వీల్లేదన్నారు.
దేవస్థానం సిబ్బందికోసం గాలిగోపురం పక్కన ఏర్పాటుచేసిన లాకర్లను ట్రస్టు బోర్డు సభ్యులు దినేష్ రాజు, సూరిశెట్టి సూరిబాబు, దాడి దేవి పరిశీలించి... ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియో ఘటన వల్ల ఇబ్బందిపడ్డా... ఈఓ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడం సంతోషకరమన్నారు. ఏఈఓలు రమణమూర్తి, ఆనంద కుమార్ ... లాకర్లను చెక్ చేశారు