న్యూఢిల్లీ జూన్ 25, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే ఏపీ సీఎస్ జైలుకే! హెచ్చరించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ( ఎన్జీటీ) థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రూ 20, వేల కోట్ల ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు
కరోనా థర్డ్ వేవ్ తలెత్తితే దీటుగా ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ సన్నద్ధత (ఈసీఆర్‌పీ-2) కింద రూ 20,000 కోట్ల ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. తదుపరి కొవిడ్-19 వేవ్ దేశాన్ని తాకితే ముందుగానే సన్నద్ధమై దాని వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిధి ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ప్యాకేజ్‌పై ప్రస్తుతం ఆరోగ్య, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు మదింపు చేస్తుండగా కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం ప్యాకేజ్ వివరాలను వెల్లడిస్తారు. దవాఖానలో పడకల పెంపు, కొవిడ్-19 వైద్య పరికరాలు, చికిత్స సదుపాయాల పెంపు, అత్యవసర మందుల సరఫరాలతో పాటు జాతీయ, రాష్ట్ర స్ధాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పెంపునకు ఈ నిధులను వెచ్చిస్తారు. మూడో వేవ్ తప్పదనే సంకేతాలతో పాటు డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరమైనదేనని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిధి ఏర్పాటు దిశగా కేంద్రం కసరత్తు సాగిస్తోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్‌తవేక్షణలో ఈ ప్యాకేజ్ అమలు కానుండగా ఐసీఎంఆర్ వంటి పరిశోధనా సంస్ధలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. జీనో్మ్ సీక్వెన్సింగ్ ద్వారా నూతన వేరియంట్లను గుర్తించడం ద్వారా చికిత్స సులువుగా చేపట్టే వెసులుబాటు ఉండటంతో పరిశోధనా సంస్ధలను ఆ దిశగా ప్రోత్సహిస్తారు. సెకండ్ వేవ్ వ్యాప్తిలో ఎదురైన అనుభవాలతో థర్డ్ వేవ్‌ను సమర్ధంగా కట్టడి చేసేందుకు కేంద్రం ముందస్తు చర్యలతో సన్నద్ధమవుతోంది.