‘జాంబీరెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన `జాంబీరెడ్డి` సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ప్రశాంత్ వర్మ చేస్తోన్న ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ . ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కాంభినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ‘హను–మాన్’ అనేక కారణాల వల్ల క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది. ప్రముఖ నటీనటులు మరియు టాప్-గ్రేడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదలైన `హను-మాన్` టైటిల్, టైటిల్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మన పురాణాలు ఇతిహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్‌హీరోస్ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అంతే కాకుండా `హనుమాన్` మన భారతీయులకు సూపర్ హీరో. హను-మాన్ సినిమా ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కి నిర్మాత సి. కల్యాన్ క్లాప్ కొట్టగా మరో నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విఛాన్ చేశారు. మొదటి సన్నివేశానికి శివశక్తి దత్త గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు వేడుకలో పొడవాటి జుట్టు, వాన్ డైక్ స్టైల్ మీసం మరియు గడ్డంతో సరికొత్త లుక్‌లో కనిపించారు హీరో తేజ సజ్జ.
జులై నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: తేజ సజ్జ