YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వైఎస్ దొంగ..నరరూప రాక్షసుడు : శ్రీనివాస్‌ గౌడ్

వైఎస్ దొంగ..నరరూప రాక్షసుడు : శ్రీనివాస్‌ గౌడ్

న్యూఢిల్లీ జూన్ 25
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు.ఇంకా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్‌ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్‌ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు.సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలున్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? మా విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. మీ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారు. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురిచేశారు. నీటిపై సీపీఐ నారాయణ స్పష్టమైన వైఖరి చెప్పాలి’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

Related Posts