YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఏమి చెయ్యాలి...?

లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఏమి చెయ్యాలి...?

లక్ష్మీ_దేవి అనుగ్రహం పొందాలంటే జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే  శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల,  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే  భోగభాగ్యాలు కలుగుతాయి. ఆలయ దర్శనం చేసుకుంటే అమ్మవారి అభయం పొందుతారు.  అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా పసుపు, కుంకుమ, చందనం, ఎరుపు రంగు జాకెట్ ముక్క, దక్షిణ కానుకగా ఇప్పించాలి. ఆవుపాలు, నెయ్యి, బెల్లంతో చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. ఇలా తొమ్మిది శుక్రవారాలు చేయడం వలన కష్టాలు తీరి అనుకున్న పనులు విజయవంతమై పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గువేసి, ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీదేవి మన ఇంటిలోనే ఉండి మనకు సకల శుభాలను చేకూరుస్తుంది. లక్ష్మీ  అనుగ్రహం  కోసం  కమల  లక్ష్మీ మాల  తో  జపం  చేయడం  చక్కని  ఫలితం ఉంటుంది...,

అమ్మవారికి స్తోత్రం అంటే ప్రీతి.. శుక్రవారం ఇలా చేస్తే..?

అమ్మవారిని స్తోత్రించిన వారికి అభీష్ట సిద్ధి లభిస్తుంది. ఒక్కొక్క దేవతకీ ఒక్కొక్కటీ ప్రీతి. శివునికి అభిషేకం, విష్ణువునకు అలంకారం, సూర్యునికి నమస్కారం, గణపతికి తర్పణము, అమ్మవారికి స్తోత్రము ప్రీతికరం. అందుకే తల్లికి స్తోత్రముల చేత అభినందించి ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అందుకే "స్తుతా దిశసి కామం'' స్తోత్రం చేత సర్వాభీష్టాలు కలుగుతాయి. అలాగే పాపాలను ఈ స్తోత్రం పోగొడుతుంది. అలాగే కోరిన కోరికలు నెరవేరాలంటే శుక్రవారమే కాకుండా ప్రతి రోజూ 108 సార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి. స్తోత్రములు అమ్మవారి మహిమ, గుణము, లీల, రూపము, తత్త్వము చెప్పబడుతున్నాయి. వాటిని స్తోత్ర రూపంలో పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయి. అలాగే స్మరణ అనేది మనస్సుకు సంబంధించినది కనుక స్మరణ చేస్తే పాపాలు నశించి పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే ఐశ్వర్య సిద్ధికి శ్రీ సూక్తం విశేష ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ అర్చనలో ఉచ్చరించే పరమశుద్ధ మంత్రాలు శ్రీసూక్తం. ఇవి అధర్వణ వేదంలో మంత్రాలు. రుగ్వేదంలో కూడా దర్శనమిస్తాయి. ప్రతిదినం భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాలను పఠిస్తూ అగ్నిలో ఆజ్యం వేల్చి హారతులిస్తే లక్ష్మీ అనుగ్రహం సత్వరం కలుగుతుంది.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts