YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దారి మళ్లుతున్న పీడీ ఫండ్స్

దారి మళ్లుతున్న పీడీ ఫండ్స్

విజయవాడ, జూన్ 26, 
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థలు తీసుకున్న రుణాలను పిడి ఖాతాల ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బడ్జెట్‌ అవసరాలకు వాడుకుంటున్న విధానం... ఆయా సంస్థలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సంస్థలకు తిరిగి చెల్లించాల్సిన ప్రభుత్వం నిధుల లేమి కారణంగా చేతులెత్తేస్తుండడంతో రుణ దాతల నుంచి సంస్థలపై ఒత్తిడి పెరిగిపోతోంది. తీసుకున్న రుణాన్ని సకాలంలో తీర్చనందున ఆ సంస్థలు డిఫాల్టర్లుగా మారిపోతున్నాయి. పిడి అకౌంట్ల ద్వారా తీసుకున్న మొత్తాలను తమకు తిరిగి ఇవ్వాలంటూ ఇటీవల కాలంలో ప్రభుత్వానికి సంస్థల నుంచి వస్తున్న లేఖలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలకు వ్యాపార నిర్వహణ, మౌలికవసతుల కల్పన, ప్రజావసరాల కోసం రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం చాలా ఏళ్లగా కొనసాగుతోంది. ఈ గ్యారంటీల మేరకే రుణదాత సంస్థలు వేల కోట్లు అప్పులు ఇస్తున్నాయి. అయితే వచ్చిన రుణాలను వచ్చినట్టే పిడి ఖాతాల్లో జమచేయించి బడ్జెట్‌ అవసరాల కోసం ఆర్ధికశాఖ ద్వారా ప్రభుత్వం పలు కార్యక్రమాలకు, పథకాలకు వాడుకుంటోంది. ప్రధానంగా ఇంధన శాఖ, పౌరసఫరాల శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్టీసీ, రోడ్లు భవనాలు, రాష్ట్ర అభివృద్ధి సంస్థ వంటివి భారీగా రుణాలు తీసుకుంటున్నాయి. ఇలాంటి రుణాలు రూ.70 వేల కోట్లపైనే ఉరటాయన్నది ఒక అంచనా. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ రకమైన ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ను ప్రోత్సహిస్తోంది. గత ప్రభుత్వం ఇదే విషయాన్ని బాహాటంగానే ప్రకటించగా, దానిపై తీవ్రపైన ఆరోపణలు చేసిన అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అదికారానికి వచ్చి అదే బాటలో పయనించడం గమనార్హం. ఆఫ్‌ బడ్జెట్‌ పేరిట తాను తీసుకున్న నిధులను తిరిగి ఇవ్వకపోవడంతో ఆయా సంస్థలు ఇబ్బందుల పాలవుతున్నాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా డిఫాల్టర్లుగా, ఎన్‌పిఎ జాబితాలోకి కూడా చేరుకుంటున్నాయి. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చెప్పలేక, మిన్నకుండలేక ఆ సంస్థల ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయినా రుణదాత సంస్థల ఒత్తిడి పెరగడంతో ఇటీవలే పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఇదే అరశంపై లేఖ రాయగా, తాజాగా ఇంధన శాఖ కూడా లేఖరాసింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఎపి జెన్‌కో, ఎపిపిపిడిసిఎల్‌ తీసుకువచ్చిన రుణాల్లో 1500 కోట్ల రూపాయలను ఇదే తరహాలో ప్రభుత్వ పిడి ఖాతాల్లో జమ చేశారు. వాటిపై కట్టాల్సిన వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఇంధన శాఖ ఉండడం గమనార్హం. గతేడాది తీసుకున్న రుణాలపై ఎపి జెన్‌కో దాదాపు రూ.82 కోట్లు, ఎపి పవర్‌ డెవలప్‌మెరట్‌ కార్పొరేషన్‌ రూ.59 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలపై వడ్డీని చెల్లించేందుకు కూడా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించకపోవడంతో కేంద్ర పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి తీవ్రపైన ఒత్తిడి వస్తున్నట్లు వారు చెబుతున్నారు. అందుకే తక్షణమే వడ్డీ మొత్తమైనా సమకూర్చాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది.

Related Posts