YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కవిత రెడీ అయిపోతున్నారా

కవిత రెడీ అయిపోతున్నారా

హైదరాబాద్, జూన్ 26, 
కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి కవిత అసెంబ్లీకి పోట ీచేయాలని భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటి నుంచే కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కవితను అసెంబ్లీకే పోటీ చేయించాలని భావిస్తున్నారు. కవిత సులువుగా గెలిచే స్థానంపై ఇప్పటికే కేసీఆర్ కు ఒక క్లారిటీ వచ్చినట్లు తెలిసింది.కల్వకుంట్ల కవిత తెలంగణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఆమె పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై గళం విప్పారు. ఐదేళ్ల పాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలను కవిత పరిష్కరించగలిగారు. ఢిల్లీలోనూ కవిత రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీ రాజకీయాలనే కవిత ఇష్టపడటంతో 2019 ఎన్నికల్లోనూ కవితకు పార్లమెంటు సీటునే కేటాయించారు.అయితే కవిత ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కవిత నిజామాబాద్ పార్లమెంటుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎ‌మ్మెల్సీగా ఎన్నికయ్యారు. కవిత పదవీ కాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె ఖాళీగా ఉండనుంది. అయితే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట.జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు కవిత సమాయత్తమవుతున్నారని తెలిసింది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కవిత కోసం సీటును త్యాగం చేసేందుకు రెడీ అయ్యారు. అందుకే టీడీపీ నేత ఎల్ రమణను టీఆర్ఎస్ లోకి తీసుకు రావాలన్న ప్రతిపాదన వచ్చిందంటున్నారు. ఇటు బీసీ నేతగా, అటు జగిత్యాల లో కవిత గెలుపునకు మార్గం సుగమం చేయడానికి ఎల్ రమణను పార్టీలోకి తీసుకువస్తున్నారన్న టాక్ వినపడుతుంది. మొత్తం మీద జగిత్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కవిత రెడీ అయిపోయారు.

Related Posts