YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా..

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా..

హైదరాబాద్, జూన్ 26 
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా కొట్టే దెబ్బ సుతిమెత్తగా ఉంటుంది. కానీ ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఆయన వ్యూహాలు ఎత్తుగడలు అర్థం చేసుకోకపోతే.. రాజకీయ ప్రత్యర్థులకు భవిష్యత్ ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాంటి ట్రాప్‌లోనే పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక్క సారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తొలి సారి వారికి ఈ రోజు అపాయింట్‌మెంట్ లభించింది. కేసీఆర్ ప్రగతి భవన్ గేట్లు తెరిచారనే ఆనందంతో.. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి వంటి ముఖ్య నేతలు పోలోమంటూ ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఇంతకూ వారెందుకు వెళ్లాలంటే.. కొద్ది రోజుల కిందట మరియమ్మ అనే మహిళ యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్‌కు గురయ్యారు. ఆ అంశం తెలంగాణలో రాజకీయం అవుతోంది. కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ అంశంపై పోలీసులపై ఫిర్యాదు చేసేందుకంటూ… సీఎం అపాయింట్‌మెంట్‌ను కాంగ్రెస్ నేతలు అడిగారు. కేసీఆర్ వెంటనే ఇచ్చేశారు. కాంగ్రెస్ నేతలు పోలోమంటూ వెళ్లి కలిశారు. కానీ వారు ముందూ వెనుకా చూసుకోలేకపోయారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నిక జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో భేటీ అవడం తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం కనిపిస్తోంది. అదే సమయంలో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా జరిగే పరిస్థితి ఉంది. తాము పోటీలో ఉన్నామని కాంగ్రెస్ నిరూపించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా.. కేసీఆర్‌తో భేటీ కావడంతో.. పొలిటికల్ సీన్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీ జరిగిన వెంటనే.. బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్‌కు బదలాయింపు చేయడానికే భేటీ జరిగిందని రఘునందన్ రావు విమర్శించారు. సాధారణ ప్రజల్లోకి ఈ భావాన్ని తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ తమ శక్తి మేర ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కేసీఆర్ వ్యూహంతో … కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గోల్ చేసుకున్నట్లయింది.

Related Posts