YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వేడెక్కుతున్న కామారెడ్డి రాజకీయం

వేడెక్కుతున్న కామారెడ్డి రాజకీయం

నిజామాబాద్, జూన్ 26, 
కామారెడ్డి జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది.టిఆర్ ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడంతో ఎటూ తేల్చు కోలేక కింది స్థాయి క్యాడర్ తలలు పట్టుకుంటోంది.మరో వైపు టిఆర్ఎస్ ఖాళీ అవుతుందని,ఎల్లారెడ్డి  మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కారు దిగి కమలం గూటికి చేరడంతో రాజకీయ సమీకరణాలు మారుతు న్నాయి.తనతో కలిసి రావాలంటూ అనుచరులకు రవీందర్ రెడ్డి ఒత్తిడి చేస్తుండగా ఆయన వెంట వెళ్లకుండా టిఆర్ఎస్ నేతలను కట్టడి చేసే పనిలో పడ్డారు ఎమ్మెల్యే సురేందర్.ఆయన పార్టీ వీడితే తమకేమీ నష్టం లేదని టిఆర్ఎస్ అంటోంది.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు టిడిపి కంచుకోట ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నెరేళ్ల ఆంజనేయులు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2004 టిఆర్ఎస్ ఆవిర్భావం తో టిడిపి పతనం మొదలైంది. టిడిపి కోటను గులాబీ పార్టీ బద్దలు కొట్టింది.2004 నుంచి 2018 వరకు 5 సార్లు ఎన్నికలు జరుగగా 5 సార్లు టిఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు.2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్ గౌడ్ చేతిలో ఓడిపోయారు.ఆ తర్వాత 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు.ఉమ్మడి జిల్లాలో 9 సెగ్మెంట్లలో ఒక్క ఎల్లారెడ్డి లోనే కాంగ్రెస్ జండా ఎగిరింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు సురేందర్ కూడా  కాంగ్రెస్ కు హ్యాండిచ్చి అధికార టిఆర్ఎస్ లో చేరిపోయారు.దీంతో ఎన్నికలలో రెండు రాజకీయ పార్టీల ప్రత్యర్థులు ఒకే గూటి పక్షులయ్యారు.సురేందర్ చేరికతో తాజా మాజీ ఎమ్మెల్యే ల మధ్య గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. తన వర్గాన్ని పెంచుకునేందుకు ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు చే జారకుండా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి లు ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలు రచించారు.రెండు గ్రూపులుగా విడిపోయారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవ డంతో కొంత కాలంగా అసంతృప్తి తో నలిగిపోతున్న రవీందర్ రెడ్డి మాజీ మంత్రి ఈటెలతో జాతకట్టారు.నీతోనే నేను అంటూ కమలం గూటికి చేరారు.పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన నియోజ కవర్గం లోని అన్ని మండలాల ముఖ్య నేతలు అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. టిఆర్ఎస్ లో తమకు సరైన ప్రాతినిథ్యం ప్రాధాన్యత దక్కడం లేదని తనతో పాటు కలిసి రావాలని కోరారు. ఉద్యమ నేత గా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలతో మమేకమవుతున్న రవీందర్ రెడ్డి తో పార్టీ మారేందుకు ఆయన అనుచరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన సొంత మండలం తాడ్వాయి తో పాటు సదాశివనగర్, రామారెడ్డి మండలాల నుంచి ముఖ్య నేతలు బీజేపీ లో చేరను న్నారు.కొత్తగా ఏర్పడిన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లో 12 స్థానాలకు గాను 9 మంది టిఆర్ ఎస్ కౌన్సిలర్లు ఉండగా ఒకరిద్దరు ఏనుగు వెంట వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.పలువురు జెడ్పిటిసిలు ఎంపీపీ లు సర్పంచి లతో కూడా రవీందర్ రెడ్డి వర్గం చర్చలు జరుపు తోంది.పార్టీ వీడితే వచ్చే నిధులు ఆగిపోతాయని వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది..
ఐతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున రవీందర్ రెడ్డి బరిలో నిలవడం ఖాయమని తేలిపోయింది. ఇక గత మూడు సార్లు బీజేపీ నుంచి పోటీచేసిన బాణాల లక్ష్మ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  ఈ ఇద్దరి మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి..ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాలతో అధికార టిఆర్ ఎస్ పార్టీ అప్రమత్తమైంది.ఎమ్మెల్యే సురేందర్ స్థానికంగా ఉంటూ క్యాడర్ తో టచ్ లో ఉంటు న్నారు.రవీందర్ రెడ్డితో   ఎవరెవరు టచ్ లో ఉన్నారు ఆయాన వెంట ఎవరు వెళ్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.అంతే కాదు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. టిఆర్ఎస్ లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కువ నిధులు తెప్పించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ లు జెడ్పిటిసి లు ఎంపీపీ లకు భరోసా కల్పిస్తున్నారు. అర్హత ను బట్టి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని చెప్తున్నారు.పట్టుకోసం ఎమ్మెల్యే సురేందర్ ప్రయత్ని స్తుండగా పరువు దక్కించుకు నేందు మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి తహ తహ లాడుతున్నారు. అయితే టిఆర్ఎస్ కింది స్థాయి క్యాడర్ మాత్రం డైలామా లో పడింది.టిఆర్ఎస్ లో ఉండాలా బీజేపీ లో చేరాలా అనే దానిపై ఎటూ తేల్చుకో లేకపోతున్నారు. రవీందర్ రెడ్డి పార్టీ వీడినంత మాత్రాన టిఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ నేతలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు
రవీందర్ రెడ్డి పార్టీ మారడంతో ఎల్లారెడ్డిలో రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఆయన వెంట ఎవరెవరు వెళ్తారు అనేదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.క్యాడర్ ను కాపాడుకోవడంలో అధికార పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు సఫలికృతం అవుతారో చూడాల్సిందే ..

Related Posts