అనంతపురం
అనంతపురం జిల్లా అమరాపురం మండల పరిధిలోని హేమావతి పంచాయితీ పరిధి ఉప్పర ట్టి గ్రామంలో తాగునీటి పథకం కోసం వేసిన విద్యుత్ తీగలు యమ పాశాలు గా మారాయని బిజెపి జిల్లా నాయకుడు నరసింహ, గ్రామస్తులు వాపోతున్నారు. మూడేళ్ల క్రితం త్రాగు నీటి కోసం గ్రామ సమీపంలోని పొలాల వద్ద బోరు వేశారని ట్రాన్స్ఫార్మర్ నుండి బోర్ వరకు ఐదు స్తంభాలు ఏర్పాటు చేయవలసి ఉండగా స్తంభాలు లేక కట్టెలను నిలబెట్టి తీగలను లాగినట్లు వారు తెలిపారు. నెల రోజుల క్రితం వర్షాలు గాలి వానలతో కట్టెలు విరిగి పోవడంతో విద్యుత్ తీగలు నేలపై పడ్డాయన్నారు. తీగలకు అక్కడ అక్కడ జాయింట్లు ఉండడంతో రైతులు పొలాన్ని దున్నడానికి, గొర్రెలు, మేకలు మేపడానికి వెళ్లిన గొర్రెల కాపరులు తీగలపై కాలు పెట్టి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్ అధికారులకు, పంచాయతీ అధికారులకు పలుమార్లు చెప్పిన సమస్య పరిష్కరించలేదని, ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నియంత్రిక ట్రాన్స్ఫార్మర్ నుండి బోర్ వరకు స్తంభాలు ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని ఉప్పరట్టి గ్రామస్తులు కోరుతున్నారు.