YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బ్యాంకు ఉద్యోగి చేతివాటం

బ్యాంకు ఉద్యోగి చేతివాటం

ఏలూరు
పశ్చిమ గోదావరిలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఉద్యోగి ఏకంగా బ్యాంకు సొమ్మును స్వాహా చేశాడు.. రైతుల క్రాప్ లోన్లు యొక్క  చెక్కుల ట్రాన్స్ ఫర్ కు  సంబంధించి రూ.30 లక్ష లను తన వారి ఖాతాలకు మళ్లించి వాడుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన బ్యాంకు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న నాగరాజు ఈ నగదును వేరే ఖాతాలకు మళ్లించి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడు.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట యూనియన్ బ్యాంకు (ఆంధ్రాబ్యాంకు)లో జరిగిన ఘటనపై రైతులు, బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.  సుమారు 50 మంది రైతులు క్రాప్లోన్లు  చెక్కుల ట్రాన్స్ఫర్ విషయంలో రూ.30 లక్షలకుపైగా నగదు బ్యాంకులో జమ చేశారు. రైతులు రుణాల కోసం బ్యాంకు మేనేజర్ను కలిశారు. డబ్బులు కట్టేశాం మాకు లోన్లు ఎప్పుడు ఇస్తారు?' అంటూ రైతులు అడగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు బ్రాండ్లో విచారణ జరిపారు రైతుల ఖాతాలను మేనేజర్ పరిశీలించగా, సంబంధిత ఉద్యోగి మూడు ఇతర అకౌంట్లలో జమ చేసి వాడుకున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులకు తెలియజేశారు. నాగరాజును ప్రశ్నించడంతో డబ్బులు మళ్లించినట్లు అంగీకరించాడు. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నాగరాజుపై పోలీసు కేసు పెడతామని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్లలకు అలవాటు పడిన కారణంగానే నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆయనపై చర్యలు తీసుకుంటామని, డబ్బు విషయంలో రైతులు ఆందోళన చెండాల్సిన అవసరం లేదని బ్యాంకు మేనేజరు శివకృష్ణ తెలిపారు.

Related Posts