YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్టు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్టు

ముంబై జూన్ 26
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణలపై అనిల్‌ దేశ్‌ముఖ్‌పై మానీలాండరింగ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) మేరకు కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం మంత్రి ఇండ్లపై దాడులు నిర్వహించారు. నాగ్‌పూర్‌లో, ముంబైలోని వ‌ర్లి ఏరియాలోని ఆయ‌న నివాసాల్లో.. రెండు వేర్వేరు బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని సెంట్రల్ ఏజెన్సీ కార్యాలయంలో మాజీ మంత్రి ఇద్దరు సహాయకులను సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన తర్వాత వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, పర్సనల్ అసిస్టెంట్ కుందన్ షిండేను అరెస్టు చేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. విచారణ సమయంలో అధికారులకు ఇద్దరూ సహకరించలేదని పేర్కొన్నారు. వారిని ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి, కస్టోడియల్‌ విచారణకు ఇవ్వాలని కోర్టును ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది.

Related Posts