ముంబై జూన్ 26
ముంబై సీరియల్ పేలుళ్ల సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను శనివారం మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ క్రైం యాక్ట్ (మొకా) కోర్టు జుడిషీయల్ కస్టడీకి పంపించింది. పోలీసుల ఇంటరాగేషన్ అనంతరం ఇక్బాల్ కస్కర్ ను జుడీషియల్ కస్టడికి తరలించారు.మాదకద్రవ్యాల రవాణాలో కస్కర్ పాత్రపై నార్కొటిక్స్ బ్యూరో అధికారి అశోక్ జైన్, దర్యాప్తు చేశారు. రెండు రోజుల రిమాండు అనంతరం కస్కర్ ను ఇంటరాగేషన్ కోసం పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నారు. అండర్ వరల్డ్ తో సంబంధాలు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం విషయాల్లో కస్కర్ వద్ద నుంచి ముఖ్యమైన క్లూలు లభించాయని పోలీసులు చెప్పారు. 2017 లో ఇక్బాల్ కస్కర్ ను బెదిరించి డబ్బుల వసూళ్ల కేసుల్లో అరెస్ట్ చేశారు. ఓ బిల్డరు ఫిర్యాదుమేర ఇక్బాల్ కస్కర్ ను అరెస్టు చేశారు. కస్కర్ అండర్ వరల్డ్ ముఠా పేరిట బెదిరించి డబ్బు వసూలు చేశాడని వెల్లడైంది.