YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనారోగ్యం బారిన అనంతపురం

అనారోగ్యం బారిన అనంతపురం

అనంతపురంలోని సర్వజనాస్పత్రి జిల్లాకే పెద్దదిక్కుగా ఉంది. జిల్లాలోని నిరుపేదలంతా ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా ఇక్కడికే పరుగుల వస్తారు. కానీ ఇక్కడ సకాలంలో వైద్యం అందక రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.ఆస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఈ మూడు నెలల కాలానికి సంబంధించి 600 రకాల మందులు ఇంత వరకు సరఫరా కాలేదు. గతంలో వచ్చిన మందులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు కాటన్, సర్జికల్‌ గ్లౌస్‌ పూర్తిస్థాయిలో లేవు. దీంతో గైనిక్, సర్జికల్, మెడిసిన్, ఏఎంసీ, ఆర్థో, తదితర విభాగాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు.   పట్టణంలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి అరకొర వైద్యసేవలతో నెట్టుకొస్తోంది. గుంతకల్లు మండలంతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు మండలాల వారే కాకుండా సరిహద్దులోని కర్నూలు జిల్లా మద్దికెర, చిప్పగిరి మండలాల వారంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే వస్తుంటారు. దీంతో రోజూ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యే రోగుల సంఖ్య 50 కిపైగానే ఉంటుంది.గర్భిణులు అధిక సంఖ్యలో వచ్చే ఈ ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండడం లేదు. సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. తగినంత సిబ్బంది లేక అటెండర్ల వైద్యం చేస్తున్నారు. బ్లడ్‌ స్టోరేజీ ఫ్రిడ్జ్‌ కాలిపోవడంతో రక్తం నిల్వచేయడం లేదు. దీంతో అత్యవసరంలో రక్తం అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని ఓ ఎక్స్‌రే మిషన్‌ పనిచేయకపోవడంతో జనం ప్రైవేటుకు వెళ్తున్నారు.  జిల్లా ఆస్పత్రిగా హిందూపురంలో వైద్యసేవలు వెరీపూర్‌గా ఉన్నాయి. పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా సేవలు మాత్రం ఆ మేరకు అందడం లేదు. రోజూ 1,500 మంది దాకా ఓపీ ఉన్నప్పటికీ ఆ మేరకు వైద్యులు, సిబ్బంది లేరు. ఈ కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు.మందుల కొరత వేధిస్తుండడంతో జనం బయట కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రిలో రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉండడంతో వ్యాధి నిర్ధారణ కష్టంగా మారింది. అందువల్లే ఇక్కడి వైద్యులు అన్ని రోగాలకు ఒకే రకంగా వైద్యం చేస్తున్నారు. దీంతో డిశ్చార్జి అయిన రెండు, మూడు రోజుల్లోనే జనం మళ్లీ రోగాలతో ఆస్పత్రులకు వస్తున్నారు.  ఆస్పత్రిలోని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌(ఏఎంసీ), సర్జికల్, చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు మూలపడ్డాయి. నూతనంగా వెంటిలేటర్లు రావడంతో పాత వాటిని మరమ్మత్తులు చేయించడం లేదు. ఇక ఆర్థో, సీఎస్‌ఎస్‌డీ విభాగాల్లో ఆటోక్లేవ్‌ మిషన్‌ ఒకటి పనిచేయడం లేదు. దీంతో కాటన్‌ తదితర వాటిని స్టెరిలైజ్‌ పూర్తి స్థాయిలో చేయడం లేదని సిబ్బందే చెబుతున్నారు. నూతనంగా వచ్చిన ఆటోక్లేవ్‌లను వాడకుండా మూలకుపెట్టారు. ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదు.

Related Posts