జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు తప్ప ఏ నిరుద్యోగిని సంతృప్తి పరచలేదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వివిధ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ దేశ్ నిరుద్యోగ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు కలిపి 36 మాత్రమే ఉండగా అందులో గ్రూప్ టూ 5 పోస్టులు మాత్రమే ప్రకటించడం ఏ విధమైన రోస్టర్ పద్ధతో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,35,794 ఉద్యోగాలు, వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వశాఖ చెబుతుంది కాబట్టి ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లను ఐదువేల రూపాయలు ఇచ్చి ఉద్యోగస్తులుగా గుర్తించడం కరెక్ట్ కాదని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు తదితర కేంద్రాలలో ఉద్యోగాల కొరకు అనేక రూపాయలు ఖర్చు చేసి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.