YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మంచినీళ్లతో మొదలుపెట్టి నిండాముంచారు

మంచినీళ్లతో మొదలుపెట్టి నిండాముంచారు

హైదరాబాద్
ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు,  ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు,  ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్,  అబ్రహం,  ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి,  కాటేపల్లి జనార్దన్ రెడ్డి  తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ మంచినీళ్లతో మొదలుపెట్టి నిండాముంచారు.  జోగుళాంబ బ్యారేజీ నిర్మించుకునేందుకు తెలంగాణకు అన్ని విధాలా హక్కు ఉంది.  బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన లెక్క ప్రకారం జూరాల ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తంలో నీటిని వాడుకోలేకపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యారేజీ ద్వారా దానిని వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణహక్కులు ఉన్నాయి.   మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల అనుమతితో తలా 5 టీఎంసీలు కేటాయించి మద్రాసుకు నీటిని తరలించడానికి తెలుగుగంగ మొదలుపెట్టారు.  మానవీయ కోణాన్ని ముందుపెట్టి తాగునీటి పేరుతో సాగునీటి దోపిడీ మొదలుపెట్టారు.  కేవలం విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించినది శ్రీశైలం ప్రాజెక్టు.  దాని నుండి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా గండిపెట్టి 11 వేల క్యూసెక్కులు తరలిస్తూ ఆ తర్వాత దానిని 44 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారు.   తెలంగాణ ఏర్పాటు అనంతరం ఉన్న వనరులను పరస్పర సహకారంతో ఉపయోగించుకుందామని తెలంగాణ స్నేహ హస్తం అందించడం జరిగింది.  మొదలు సానుకూలత వ్యక్తం చేసిన ఆంధ్రా ప్రభుత్వం ఆ తరువాత ఎప్పటిలా ఏకపక్షంగా ప్రాజెక్టు నిర్మిస్తూ మొండిగా ముందుకువెళ్తుంది .  కృష్ణానదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమేని అన్నారు.
 ఈ అక్రమ నిర్మాణం మీద చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గర్హనీయం .. రాష్ట్రాలకు దారిచూపాల్సిన భాధ్యత కేంద్రానికి ఉంటుంది.  తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రాతిపదికనే ఒక కుట్ర . . ఆ కుట్రలో ప్రధాన అంశం సాగు నీటి వనరుల దోపిడీ.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దక్కన్ పీఠభూమి తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉంది .. క్రమంగా అది నాశనం అవుతూ వస్తుందని బచావత్ ట్రిబ్యునల్ స్వయంగా తన నివేదికలో పేర్కొంది.  హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బూర్గుల ప్రభుత్వం అప్పర్ క్రిష్ణ, తుంగభద్ర లో-లెవెల్ కెనాల్, భీమా ఇరిగేషన్ ప్రాజెక్టులను 180 టీఎంసీల నీరు వాడుకునేలా తలపెట్టారు ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ప్రాజెక్టులన్నీ  వెనక్కు పోయాయని బచావత్ ట్రిబ్యునల్ వెల్లడించింది.
కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో 26 వేల చదరపు మైళ్లు, తెలంగాణలో 20 వేల చదరపు మైళ్లు  ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 9 వేల చదరపు మైళ్లు  మాత్రమే.  ఏదైనా ప్రాజెక్టు తలపెట్టినా దాని నీటి పరివాహక ప్రాంతం, నీటి లభ్యత, ఆ ప్రాంత వెనకబాటుతనాన్ని ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులు కడతారు.  ఆంద్రప్రదేశ్ అవతరన తర్వాత తెలంగాణ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు పక్కనపడేసి ఆంధ్రా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నారు.  తెలంగాణకు జరిగిన నష్టం గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనీసం బచావత్ ట్రిబ్యునల్ ముందు ప్రస్తావించకపోవడంతో స్వయంగా బచావత్ ట్రిబ్యునల్ పాలమూరు జిల్లాకు సాగునీటి వసతి కల్పించేందుకు 17.84 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు కేటాయించారు.  ఆంధ్రప్రదేశ్ అవతరణతో తెలంగాణకు నష్టం జరిగిందని ..  జూరాల ప్రాజెక్టు ద్వారా 17.84 టీఎంసీల నీటిని వినియోగం చేసుకునే అవకాశం లేనట్లయితే దానిని పాలమూరు జిల్లాలోనే మరొక చోట వినియోగించుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ స్ఫష్టంగా చెప్పింది .. ఇది రెండు రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధం లేదని, అలా చూడవద్దని కూడా తేల్చిచెప్పింది.  జూరాల నిర్మాణం 11 టీఎంసీల సామర్ద్యం .. రిజర్వాయర్ లెవెల్ 9.5 టీఎంసీలకు గాను 6.5 టీఎంసీలనే వాడుకోగలుగుతున్నాం.  బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్  జోగుళాంబ బ్యారేజిని ఎంతో ముందుచూపుతో ప్రకటించారని అన్నారు.

Related Posts