పాములపాడు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు అందించాలి, 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకు రావాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు పెట్టుబడి సహాయం అందించాలన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కూలి రోజుకు రూ.600లు ఇవ్వాలన్నారు. కరోనా నేపథ్యంలో ఆదాయపన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి రూ. 7,500లు ఆర్థిక సహాయం అందించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘము, ఏపీ రైతు సంఘము, సీఐటీయూ సంఘాలుగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను పాములపాడు మండల కేంద్రలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్ధగం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘము జిల్లా నాయకులు బంగారం. రామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వ్యవసాయ కర్నికా సంఘము నాయకులు బాలయ్య, సేవ భారతి అధ్యక్షుడు షార్పుదిన్, సీఐటీయూ మండల కార్యదర్శి రాజు,అమాలి ధనమయ్య, ఆటో నాయకుడు డక్కా. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.