YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సబ్ జైల్ లో మెరుగైన సౌకర్యాలు

సబ్ జైల్ లో మెరుగైన సౌకర్యాలు

పత్తికొండ
పట్టణంలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన సబ్ జైలు లో మెరుగైన సదుపాయాల్ని ఏర్పాటు చేశామని సబ్ జైలు ఇంచార్జి చంద్రమోహన్ అన్నారు. ఉదయం విలేకరితో ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు వేర్వేరు కేసుల్లో 57 మంది ఖైదీలు ఉన్నారని తెలిపారు. కరోనా రాకముందు 33 మంది ఉండేవారని కరోనా సమయంలో 24 మంది సబ్ జైలు కు ఇచ్చిన ఖైదీలకు కరోనా టెస్టులు చేయించామని వివరించారు. ఎవరికి కరోనా రాలేదంటూ తెలిపారు. ప్రభుత్వం నుంచి మాస్కులు, శానిటైజర్లు, బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేశారని తెలిపారు. సబ్ జైల్ లో ఎవరికి ఇలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన మెనూ ప్రకారంగా భోజనాలు పెడుతున్నామని చెప్పుకొచ్చారు. సోమవారం పులిహోర, మంగళవారం పొంగల్, బుధవారం చపాతి, గురువారం రైస్ ఉప్మా, శుక్రవారం పొంగల్, శనివారం చపాతి, ఆదివారం గోధుమ ఉప్మా, ఇస్తున్నామని తెలిపారు. వారంలో ఒకరోజు మటన్, మరో రోజు చికెన్, ఇంకో రోజు కోడిగుడ్లు ఇస్తున్నామని వివరించారు. ఒక్కొక్కరికి 350 గ్రాములు బియ్యం, టిఫిన్ కు 100 గ్రాములు ప్రకారంగా మెనూ పాటిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు టిఫిన్ తో పాటు టీ, మధ్యాహ్నం 11 గంటలకు భోజనం, పప్పు, రసం సాయంత్రం 4:30 గంటలకు భోజనం, విజిటేబుల్ కర్రీ, పెరుగు ఇస్తున్నామని తెలిపారు. రెండుసార్లు టీ ఇస్తున్నామన్నారు. ఖైదీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీస సౌకర్యాలు కల్పించామని, అందులోనే శుభ్రమైన రూములు, అటాచ్ బాత్రూంలు, మరుగుదొడ్లు, ఏర్పాటు చేశామని చెప్పారు. సీజనల్ వ్యాధులు వచ్చిన సమయంలో వ్యాధి వచ్చినా, రాక పోయినా వారానికి రెండు సార్లు, పుచ్చకాయల మాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని శ్రావణి రెండుసార్లు సబ్ జైలు ఖైదీలకు చికిత్స చేసి అవసరమైన మందులు ఇచ్చి వెళ్తున్నారని తెలిపారు.

Related Posts