YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*ఉదయం మీదైతే.. విజయం మీదే!*

*ఉదయం మీదైతే..   విజయం మీదే!*

విజేత అంటే... అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకున్నవాడు. అందరికంటే ముందుగా చేరు కున్నాడంటే... అందరికంటే ముందుగా సాధన ప్రారంభించి ఉంటాడు. అందరికంటే ముందుగా ప్రారంభించాడంటే, అందరికంటే ముందే లక్ష్యం గురించి ఆలోచించి ఉంటాడు. అందరికంటే ముందే ఆలోచించాలంటే, అందరికంటే ముందే నిద్రలేవాలి. అంటే, "ది ఫైవ్ ఏఎమ్ క్లబ్ లో సభ్యులు కావాలి. రాబిన్‌ శర్మ తాజా పుస్తక సారాంశం ఇదే.

1.      పొద్దున్నే నిద్రలేవడం బ్రహ్మవిద్యేం కాదు. మనల్ని మనం కష్టపెట్టుకోవడం అంతకన్నా కాదు. దేనికైనా ప్రారంభం, ముగింపు అనేవి ఉంటాయి. ఏ ఏడింటికో, ఎనిమిదింటితో రోజు మొదలు కాదు. మన పెద్దలు బ్రాహ్మీ ముహూర్తమని చెప్పిన సమయం నుంచే... అంటే తెల్లవారుజామున ఆ రోజు ఆరంభం అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడు మెల్కొన్నా ' లేట్ అటెండెన్స్' కిందే లెక్క. ఆలస్యంగా వచ్చిన విద్యార్థికి పాఠమూ ఆలస్యంగానే అర్థం అవుతుంది. మార్కులు కూడా అంతంతమాత్రంగానే వస్తాయి. ముందుగా బడికి వచ్చిన విద్యార్థి ఎప్పుడూ ముందే ఉంటాడు. కాబట్టి, జీవిత పాఠశాలలో 'లాస్ట్ బెంచ్ ఫెలో' అని పించుకోకూడదంటే, తెల్లవారు జామున మేల్కొనాల్సిందే... 

 2.     సమాజంలో ఐదుశాతం మంది... విజేతలూ నాయకులూ. మిగిలిన తొంభై అయిదు శాతమూ అనుచరులూ పరాజితులే. ఆ ఐదుశాతం మందిని పరిశీలిస్తే... వాళ్ల దినచర్య తెల్లవారు జామునే మొదలవుతుంది. అంతా నిద్రపోతున్న వేళలో వాళ్లు మేల్కొంటారు. అంతా కలలు కంటున్న సమయంలో వాళ్లు కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచి స్తారు. అంతా పరుగు ప్రారంభించే సమయానికే వాళ్లు గమ్యాన్ని చేరుకుంటారు. ఓ గంట ముందు లేస్తే పోయేదేం లేదు.... బద్దకం తప్ప !

3.     ప్రమోషన్లు వచ్చేవరకో, సొంతిల్లు కొనేవరకో, కోటి రూపాయలు సంపాదించే వరకో.... మీ ఆనందాన్ని వాయిదా వేసుకోకండి. గమ్యం వైపుగా సాగించే ప్రయాణంలో ప్రతి నిమి షాన్నీ ఆస్వాదించండి, ఆనందించండి.

4.    ఎవరో పిలిచి కిరీటం పెట్టినప్పుడు మాత్రమే ... మన శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించాలనే పిచ్చి నిర్ణయానికి కట్టుబడిపోయి.. మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం వాయిదా వేయకండి. ప్రపంచం గుర్తించిన తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాకే ప్రపంచం గుర్తిస్తుంది.

5.     వికాసానికి ఓ ముగింపు అంటూ లేదు. ఓ శిఖరాన్ని చేరుకోగానే పర్వతారోహణ పూర్తయి పోదు. అంతకంటే ఎత్తయిన మరో పర్వతం మీకోసం సిద్ధంగా ఉంటుంది. నన్ను అధిరో హించమంటూ సవాలు విసురుతుంది. జిజ్ఞాసి నిత్య విద్యార్థి. నిరంతర యాత్రికుడు.

    పేదరికానికి కారణం... చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మనసును చుట్టుముట్టిన భావ దారిద్ర్యం. కాబట్టి, ఎంత తొందరగా నిద్ర మేల్కొంటే, అంత తొందరగా ప్రపంచాన్ని ఏలుకుంటావు.            

ఓం నమో నారాయణాయ

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts