YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అరుణాచలం: రుద్రుని ప్రతిరూపాలే రుద్రాక్షలు

అరుణాచలం: రుద్రుని ప్రతిరూపాలే రుద్రాక్షలు

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు. 

తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.

సరస్వతీ నదితో సమానం: 

రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,

పాటించవలసిన నియమాలు: 

1. రుదక్ష్రమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.

2. రుదక్ష్ర మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.

3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుదక్ష్రమాలను మరొకరు ధరించకూడదు.

4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.

5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.

6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.

7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

ధారణవిధి: 

సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.

ధరించవలసిన తిథులు: 

పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందƒ పురాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనే షియా, నేపాల్‌ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.

జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు: 

నక్షత్రము 

ధƒరించవలసిన రుద్రాక్ష, అశ్వని - నవముఖి,భరణి-షణ్ముఖి, కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి, రోహిణి - ద్విముఖి, మృగశిర -త్రిముఖి, ఆరుద్ర- అష్టముఖి, పునర్వసు- పంచముఖి, పుష్యమి- సప్తముఖి, ఆశ్లేష - చతుర్ముఖి, మఖ- నవముఖి, పుబ్బ- షణ్ముఖి, ఉత్తర-ఏకముఖి, ద్వాదశ ముఖి, హస్త - ద్విముఖి, చిత్త - త్రిముఖి, స్వాతి- అష్టముఖి, విశాఖ-పంచముఖి, అనురాధ - సప్తముఖి, జ్యేష్ఠ-చతుర్ముఖి, మూల- నవముఖి, పూర్వాషాఢ- షణ్ముఖి, ఉత్తరాషాఢ- ఏకముఖి లేదా ద్వాదశముఖి, శ్రవణం- ద్విముఖి, ధనిష్ట -త్రిముఖి, శతభిషం- అష్టముఖి, పూర్వాభాద్ర - పంచముఖి, ఉత్తరాభాద్ర- సప్తముఖి, రేవతి- చతుర్ముఖి

ఏక ముఖి రుద్రాక్ష : 

ఏక ముఖి రుదక్ష్ర బహు అరుదైనది... ఇంకా అతి ప్రభావవంతమైనది. గుండ్రని ఏకముఖి రుద్రాక్ష లభ్యం బహు అరుదు సాలీనా నాలుగు లేదా ఐదుకన్నా ఎక్కువ లభ్యమవ్వవు. ఎక్కువగా లభించే ఏకముఖి రుద్రాక్షలు అర్థ చంద్రాకారంలో ఉంటాయి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, పవిత్ర భావనలు పొందుతారు, దుష్టశక్తుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. భగవద్భక్తి, భాగవతుల సత్సంగాసక్తి పెరుగుతుంది. మానసిక తృప్తి్త, ఇంద్రియనిగ్రహం కలుగుతుంది. సంఘంలో, తన చుట్టూ ఉన్నవారిమధ్య కీర్తి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కలగటానికి దోహదపడి ఉద్యోగ వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి స్థిరీకరణకు కలిగే దోషాలను తొలగించగలిగే శక్తిని బుద్ధిని ఇస్తుంది. కొన్ని రకాల దీర్ఘవ్యాధులు, మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. విటమిన్‌ డి లోపం వల్ల కలిగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఏక ముఖి రుద్రాక్ష సాక్షాత్‌ పరతత్త్వ స్వరూపమని రుద్రాక్ష జాబాలోపనిషత్‌ చెప్తోంది. ``ఏక వక్త్రం తు రుద్రక్షం పరతత్వరూపకమ్‌ తద్ధారణాతత్పరెతత్వే లీయతే విజితేంద్రియః'' ఏక ముఖి రుద్రాక్ష ధారణ వల్ల జాతకంలో సూర్య గ్రహం వల్ల కలిగే దుష్ఫలితాలు తగ్గించబడతాయి. గ్రహ అనుగ్రహానికి ధరించే రత్నం కన్నా రుద్రాక్ష ధారణ సర్వదా క్షేమకరం. అతి ఫలప్రదం. ఈ రుదక్ష్రలను, పర్వదినం నాడుకానీ, మాస శివరాత్రి, పౌర్ణమి, ఏకాదశి, సోమవారాదులలో ధరించవచ్చు.'

రుద్రాక్షలకు అభిషేకం: 

ధరించేముందు ప్రతి రుద్రాక్షకు అభిషేకం నిర్వహించి లేదా కనీసం ఆయా రుద్రాక్షల మూల దైవ స్వరూపాన్నీ, అధిదైవతాన్నీ ప్రాణ ప్రతిష్ఠాది ఆవాహనాదులతో పూజ చేయించి ధరించడం వల్ల శీఘ్ర ఫలితం కలుగుతుంది. పంచాక్షరి/షడక్షరి ఉపదేశం ఉన్నవారు అది జపిస్తూ రుద్రాక్ష ధరించవచ్చు లేదా ఓం శివాయ నమః అన్న నామం చెప్తూ ధరించవచ్చు.

సాధారణంగా అతి చిన్న అర్థచంద్రాకారపు ఏక ముఖి రుద్రాక్ష రూ 1000, మధ్యసైజుది రూ.1500-1800 పెద్దది (కలెక్టబ్‌ల్‌ సైజ్‌ అంటారు)రూ.3000-3500లకు దొరుకుతుంది. మార్కెట్లో చాలా ఎక్కువకు అమ్ముతుంటారు.

నకిలీలతో జాగ్రత్త : 

వీటికొరకు డిమాండ్‌ ఎక్కువ ఉండడం వల్ల, బోన్‌ పౌడర్‌, ఫైబర్తో అచ్చుపోసి అమ్మేస్తూంటారు. టివిల్లో వచ్చే ప్యాకేజీ యాడ్‌‌స ఎక్కువ శాతం ఇవే అమ్ముతూంటారు (మంచివి అమ్మేవారూ లేకపోలేదు) కాబట్టి ఈ రుద్రాక్షని చేత్తో ముట్టుకుని తడిమి ప్లాస్టిక్‌ అచ్చు వగైరాలా ఉన్నదాలేదా అని చూసుకోవాల్సి ఉంటుంది.

ఈ రుద్రాక్షకి అతి సన్నని రంధ్రం ఉండడం వల్ల తీగ ఎక్కదు, కాబట్టి క్లిప్‌ వంటిది చేసుకొని లాకెట్‌లాగా ధరించాలి. రంధ్రం చేయిస్తే లోపల ఉన్న గింజ దెబ్బతిని అది విడుదల చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్‌ తరంగాలు తగ్గడం వల్ల మనం దాన్ని ధరించినా ఎక్కువ ఉపయోగం ఉండదు. ఆరోగ్యవంతమైన మంచి రుద్రాక్షలను ఎన్నుకోవడం ద్వారా పలుకాలాలు వాటిని ధరించి సత్ఫలితాలను పొందవచ్చు.

ఆందోళనలేకుండా చేస్తాయి: 

రుద్రాక్షలు పర్వతాల మీద ముఖ్యంగా హిమాలయాల్లో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి గింజలు. అవి ఇంకా పలు ప్రాంతాల్లో, పశ్చిమ కనుమల్లో కూడా పెరుగుతాయి. ఎక్కువ రుద్రాక్షలు నేపాల్‌, బర్మా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాల నుంచి వస్తాయి. రుద్రాక్షలు మీ శక్తితోనే ఒక గూడులాగా తయారు చేసి, వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చేస్తాయి.అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ తిరుగుతూ, వేర్వేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం. మీరు గమనించే ఉంటారు. మీరు కొత్త చోటుకు వెళ్లినప్పుడు, ఒక్కోచోట మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు. ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా నిద్రరాదు. దీనికి కారణం మీ చుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైంది కాకపోవటం వల్ల. అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. సాధువులు, సన్యాసులు ఒకేచోట రెండవసారి పడుకోకూడదు తిరుగుతూ ఉంటారు. అందువల్ల పరిస్థితులు, పరిసరాలు వారికి బాధ కలిగించవచ్చు. అందుకే వారెప్పుడూ రుద్రాక్షలు వేసుకునే ఉంటారు.

దుష్టశక్తులనుండి కాపాడేది: 

ఈ రోజుల్లో మళ్లీ ప్రజలు వారి వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటారు. పడుకుంటారు. మనిషి ఒకేచోట పడుకుంటుంటే, తింటుంటే వారికి అక్కడ ఒక రకమైన గూడు ఏర్పడుతుంది. కానీ ఎప్పుడూ తిరిగే వారికి, అనేక చోట్ల తినే వారికి, నిద్రించే వారికి, రుద్రాక్ష మీ శక్తితోనే గూటిని ఏర్పరస్తుంది.ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశముంది. కాబట్టి అరణ్యాల్లో నివసించే సాధువులు, సన్యాసులు అన్ని చోట్ల మంచినీరు తాగలేరు. అలా తాగితే ఆ నీరు వారిని దుర్బలం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది. ఆ నీటి మీద రుద్రాక్షమాలను పట్టుకుంటే, మాల సవ్య దిశలో తిరిగితే ఆ నీరు తాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్షమాల అపసవ్య దిశలో తిరుగుతుంది. రుద్రాక్ష దుష్ట శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది. కొందరు ఇతరులకు హాని కలిగించటానికి కొన్ని దుష్టశక్తులను ప్రయోగించవచ్చు. అయితే ఈ హానికరమైన సంఘటనల నుంచి రుద్రాక్ష కవచంలా పనిచేస్తుంది. ఈ విధంగా శక్తివంతం చేసిన రుద్రాక్షలను గృహస్థులు వేసుకోకూడదు. రుద్రాక్షకు ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షను దుకాణంలో కొని వేసుకోకూడదు. కానీ పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రాదోహదకారి.

రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. మీ నరాలకు కొంత నెమ్మదిని కలిగించి మీ నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది. మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే, రుదక్ష్ర మంచి ఉపకరణం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts