YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒక్కటవుతున్న బీజేపీయేతర ప్రభుత్వాలు

ఒక్కటవుతున్న బీజేపీయేతర ప్రభుత్వాలు

వ ఆర్థిక సంఘవ నిర్ధేశించిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బిజేపియేతర ప్రభుత్వాలు ఒక్కటవుతున్నాయి. ఈ నెల ఏడో తేదిన విజయవాడలో నిర్వహించనున్న సమావేశానికి దేశ వ్యాప్తంగా 13 రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు. నాలుగు రాష్ట్రాలనుండి ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  గత నెల 10న తిరువనంతపురంలో దక్షిణాదిరాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. తదుపరి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని, ఉత్తరాది రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామం చేయాలని ఆ సమావేశంలోనే నిర్ణయించారు. ప్రధానంగా 15వ ఆర్ధిక సంఘానికి కేంద్రం నిర్ధేశించిన మార్గదర్శకాల ద్వారా రాష్ట్రాలకు జరిగే అన్యాయాలపైనే ఎక్కువ గా చర్చ జరపనున్నట్లు వారు పేర్కొన్నారు. దీనిలో బాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఈ నిర్ణయానికి దేశ వ్యాప్తంగా బిజెపి యేతర ప్రభుత్వాల నుండి సానుకూల స్పందన వచ్చింది. ఒడిషా తరఫున శశిభూషణ్‌ బెహరా, ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీష్‌ సిసోడియా, పంజాబ్‌ ఆర్ధిక మంత్రి మన్‌ప్రీత్‌సిరగ్‌, పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా హాజరుపై స్పష్టత వచ్చిరది. అలాగే పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ చాంబ్లింగ్‌, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్‌ సంగ్మాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుతం ఒడిషా, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమ బెరగాల్‌, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్‌లను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయిరచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆహ్వానం పంపించింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వస్తామంటూ సుముఖత లేఖలను పంపించాయి. ఇదే సమయంలో తెలంగాణ కూడా ఓకే చెప్పేసింది. ఆ రాష్ట్రం నుండి ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ హాజరు కానున్నారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐసాక్‌, కర్నాటక నురచి అక్కడి వ్యవసాయశాఖ మంత్రి బైరేగౌడ హాజరుకానున్నారు. అలాగే మిజోరామ్‌ ఆర్థిక మంత్రి లాల్‌సన్తా, తమిళనాడు ఆర్ధిక మంత్రి పన్నీర్‌ సెల్వంలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిరచారు. వీరిలో ఒక్క పన్నీర్‌ సెల్వం తప్ప మిగిలిన వారంతా హాజరు కానున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు వెల్లడిరచారు.  కేరళ సమావేశానికి ఆరు అంశాలతో అజెండా సిద్ధం చేసి చర్చించగా, ఈసారి మరిన్ని అంశాలను అదనంగా అజెండాలో చేర్చను న్నట్లు అధికారులు చెబుతున్నారు. కేరళ భేటీకి హాజరైన ఆర్ధిక నిపుణులతోపాటు, స్థానిక, వివిధ రాష్ట్రాలకు చెరదిన ఇతర ఆర్ధిక నిపుణులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే దాదాపు పది మంది నిపుణులను ఆహ్వానిస్తూ లేఖలు కూడా పంపించారు. 

Related Posts