న్యూఢిల్లీ జూన్ 28
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలికి నివాళులర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారని, తద్వారా దేశ భవిష్యత్తుకు బాటలు పరిచారని పేర్కొన్నారు. మాతృభాషకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారని గుర్తుచేసుకున్నారు. పీవీ సేవలను జాతి చిరకాలం గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.‘భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. స్వావలంబన, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారు. విశాల దృష్టితో వీక్షించి, దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుంది’ అని వెంకయ్య నాయుడు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.