YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జూన్ 1 నుంచి 10రోజల పాటు కూరల బంద్

జూన్ 1 నుంచి 10రోజల పాటు కూరల బంద్

జూన్ ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు మీకు పాలు, కూరగాయలు, సరుకులు.. ఏమీ అందకపోవచ్చు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో నగరాల వాసులు చూడబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 110 రైతు సంఘాలతో కూడిన రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు తాము పాలు, కూరగాయలు, ఇతర సరుకులు సరఫరా చేయుబోమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. జూన్ పదో తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన వారిలో రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ నేతలతో పాటు బీజేపీ మాజీ నాయుకుడు యశ్వంత్ సిన్హా కూడా ఉన్నారు. జూన్ ఆరో తేదీన సహకార నిరాకరణోద్యమం చేస్తారని ఆయన తెలిపారు. రైతులకు ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా కనీస మద్దతుధర నిర్ణయిస్తామని ప్రభుత్వం తెలిపినా, ఇంతవరకు రైతులకు ఆ ధర దక్కలేదన్నారు. కనీస మద్దతు ధరను ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా ఇవ్వడంతో పాటు ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయాలని మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు నాయుకుడు శివకుమార్ కక్కా అన్నారు. ఉత్పత్తి ధర లెక్కించేటపుడు కూడా కేవలం ఆ పంట వేయుడానికి, ఎరువులు, పురుగుమందులు తదితరాలకు అయిన ఖర్చు మాత్రమే కాదని.. రైతు కుటుంబం చేసిన కూలీ విలువ, పొలానికి అయిన కౌలు, సొంత భూమి కొనడానికి అయిన ఖర్చు మీద వడ్డీ.. ఇలాంటి వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది రైతుసంఘాల ప్రధాన డిమాండు. గత నెలలో మహారాష్ట్రలో రైతులు నిర్వహించిన లాంగ్ మార్చ్‌ని యశ్వంత్ సిన్హా ప్రశంసించారు. ప్రభుత్వం తప్పుడు హామీలిచ్చిందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు, చేసిన నినాదాలు అన్నీ ఒక ఫార్సుగా మిగిలిపోయాయని, రైతులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి సాయం చేయులేదని ఆయన అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కూడా నెరవేర్చలేదని చెప్పారు. వాణిజ్య సంస్థలు కూడా తాము జూన్ 10న తలపెట్టిన భారత్ బంద్‌కు సహకరించాలని రైతులు కోరారు. 

Related Posts