కర్నూలు
మంత్రాలయం లో సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. ఆదివారం నాడు పడిప వర్షానికి మంత్రాలయం టౌన్ తడిసి ముద్దైయింది. నల్లవంక వాగుకు గండి పడటంతో వరదనీరు పొంగిపొర్లింది. బస్టాండ్ , కర్ణాటక గెస్ట్ హౌస్ , జిల్లా పరిషత్ హైస్కూల్ , పలు కాలనీలోకి వరదనీరు చేరింది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆదోని ఆర్డీవో వరద ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.