అమరావతి జూన్ 28
విశాఖపట్టణాన్ని ముఖ్య మంత్రి ఐటీ నగరం చేస్తారా అని అని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యువతకు వేల ఉద్యోగాలు లేకుండా చేశారన్నారు. ‘‘నాడు నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖకి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చారు. ప్రపంచ దిగ్గజాలని నగరానికి ఆహ్వానించారు. నేడు లులూ, డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐబీఎంని పక్కరాష్ట్రాలకి తరలించారు. ఉత్తరాంధ్ర యువతకి వేల ఉద్యోగాలు లేకుండా చేశారు. మూడో ఏడాదిలో కూడా కనీసం ఐటీ పాలసీ లేదన్నారు.