YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ లో రెండు కోట్ల రూపాయల నిధులతో కోమటికుంట చెరువు,పోచమ్మ కుంట చెరువు సుందరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.  కాలనీలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, చెరువులు కబ్జాకు కాకుండా సుందరీకరణ చేసి స్థానిక ప్రజలకు అందిస్తే సురక్షితంగా ఉంటాయని మంత్రి  అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని మంత్రి అన్నారు. చెరువులను ఆధునీకరించడం ద్వారా ప్రజలు వరద ముప్పు కు గురికాకుండా సురక్షితంగా బయటపడే అవకాశం ఉందని మంత్రి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చెరువులు అభివృద్ధి జరుగుతున్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి,  నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts