YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ ప‌ద‌వీకాలం మ‌ళ్లీ పొడిగింపు

అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ ప‌ద‌వీకాలం మ‌ళ్లీ పొడిగింపు

న్యూఢిల్లీ జూన్ 28
అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ ప‌ద‌వీకాలాన్ని మ‌ళ్లీ పొడిగించారు. బుధ‌వారం ఆయ‌న రిటైర్ కావాల్సి ఉంది. కానీ మ‌రో ఏడాది పాటు అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్‌కు బాధ్య‌త‌ల్ని పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 90 ఏళ్లు. జూన్ 2017లో మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముఖుల్ రోహ‌త్గీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రిజైన చేసిన త‌ర్వాత ఆ బాధ్య‌త‌ల‌ను వేణుగోపాల్‌కు అప్ప‌గించారు. మూడేళ్ల ప‌ద‌వీకాలం కోసం జూలై 1, 2017లో ఆయ‌న్ను నియ‌మించారు. అయితే గ‌త ఏడాది కూడా ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. భార‌త దేశ 15వ అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఏజీ వేణుగోపాల్ నియ‌మితులైన విష‌యం తెలిసిందే. 2019లో మోదీ ప్ర‌భుత్వం రెండ‌వ‌సారి గెలిచిన త‌ర్వాత కూడా ఆయ‌న ఆ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. మొరార్జీ దేశాయ్ ప్ర‌భుత్వ హ‌యాంలో అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కొత్త ఆదేశాల ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు కేకే వేణుగోపాల్ అటార్నీ జ‌న‌ర‌ల్‌గా కొన‌సాగుతారు.

Related Posts